ఒక హీరో, ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉండే సినిమాలు తెలుగులో చాలానే చూసి ఉంటారు. అందులో హీరో ప్రియురాళ్ల నుంచి తప్పించుకోడానికి ఎన్నో ఎత్తులు వేస్తాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని కలుస్తూ.. సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ సీన్స్ చూసేందుకు చాలా ఫన్నీగా ఉంటాయి. కానీ, నిజ జీవితంలో అలాంటి పనులు దినదిన గండంలా ఉంటాయి. ఏదో ఒక రోజు నిజం బయటపడకపోదు. ఈ యువతి విషయంలో కూడా అదే జరిగింది. అయితే, ఈమె ఇద్దరు ముగ్గరితో సరిపెట్టుకోలేదు. ఒకేసారి ఆరుగురితో డేటింగ్ చేసింది. ఒకరికి తెలియకుండా ఒకరిని కలుస్తూ.. వారి వద్ద మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాదు, ఖరీదైన గిఫ్టులు కొనిపించుకుంటూ జల్సాలు చేసింది. చివరికి దొరికిపోయింది.
చైనాకు చెందిన మావో అనే 42 ఏళ్ల మహిళ.. ఇటీవల వార్తల్లో హెడ్‌లైన్స్‌గా మారింది. డేటింగ్ కోసం ఆరాపడుతున్న ఆరుగురు పురుషులు ఆమెకు బంగారు బాతుల్లా చిక్కారు. ఇంకేముంది వారిని మాటల్లో పెట్టి డేటింగ్ మొదలెట్టింది. ఒకరికి తెలియకుండా ఒకరితో డేటింగ్ చేస్తూ.. ఆరుగురినీ మాయ చేసింది. వారితో క్లోజ్‌గా ఉంటూ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, దుస్తులు కొనిపించుకొనేది. డబ్బులు కూడా భారీగా దండుకొనేది. అయితే, ఆరుగురిలో ఒకరికి ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఎట్టకేలకు ఆమెపై ఓ కన్నేశాడు. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు.
స్థానిక మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. ఆమె బాయ్‌ఫ్రెండ్స్‌లో ఒకరైన యూ అనే వ్యక్తి ఆమె రొమాంటిక్ స్కా్మ్‌ను బయటపెట్టాడు. జేజియాంగ్ ప్రావీన్స్‌లోని యువ్యూ ప్రాంతానికి చెందిన ఓ మహిళను తాను గతేడాది ఆగస్టు నెలలలో ఓ డేటింగ్ సైట్ ద్వారా కలిశానని తెలిపాడు. అందులో ఆమె విడాకులు తీసుకున్నానని, పిల్లలు కూడా లేరని పేర్కొందన్నాడు. తనతో శాస్వతంగా కలిసి ఉండే వ్యక్తి కోసం వెతుకుతున్నానని తెలిపినట్లు యూ వెల్లడించాడు.
Also Read: ఆమె జుట్టునే గూడుగా మార్చుకున్న పక్షి, 84 రోజులు అక్కడే తిష్ట!
అతడు ఆమె అందానికి పడిపోయాడు. దీంతో ఏది కావాలంటే అది కొనిచ్చేవాడు. చివరికి ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా యూ.. ఆమె కుటుంబికులను కలిసి మాట్లాడేందుకు ఆసక్తి చూపేవాడు. కానీ, ఆమె మాత్రం దాన్ని వాయిదా వేయడానికి సాకులు వెతికేది. దీంతో అతడికి అనుమానం వచ్చింది. ఆ తర్వాత కూడా అతడు పెళ్లి దుస్తులు కొనుగోలు చేయడానికి, వేదిక ఏర్పాటు కోసం ఆమెకు డబ్బులిచ్చాడు. కానీ, ఆమె మాత్రం ఈవెంట్ ఆలస్యం చేస్తూనేఉంది. దీంతో అతడి అనుమానం మరింత పెద్దదైంది. తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించడంతో యూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆమె అసలు గుట్టు బయటపడింది. ఆమె మరో ఐదుగురితో కూడా డేటింగ్‌లో ఉన్నట్లు తేలింది. ఆరు నెలల వ్యవధిలో ఆమె కనీసం ఆరుగురి నుంచి 150,000 యువాన్(రూ.17,89,167) విలువ చేసే గిఫ్టులు, నగదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి, మీరు కూడా డేటింగ్ చేసేప్పుడు జాగ్రత్త.
Also Read: డయాబెటిస్ బాధితులకు ఈ సమ్మర్ పెద్ద సవాలే, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!