విరాట్ కోహ్లీ సొంత బ్రాండ్ దుస్తుల్ని మార్కెట్ చేయడం చూశాం. తెలుగు హీరో విజయ్ దేవరకొండ ఇలా కొద్దిగా ఫేమ్ రాగానే రౌడీ పేరుతో బ్రాండ్ లాంచ్ చేసి ఫ్యాషన్ బిజినెస్‌లోకి చూశాం. ఇలా స్పోర్ట్స్.. సినిమా స్టార్లకు వారి వారి క్రేజ్‌కు తగ్గట్లుగా సొంత బ్రాండ్లు రిలీజ్ చేయడం కామన్. కానీ ఇప్పుడు ముంబై పోలీసులు ( Mumbai Police ) ఆ ఫీట్ సాధిస్తున్నారు. సొంతంగా ముంబై పోలీస్ పేరుతో ఓ బ్రాండ్ పెట్టేసి.. ఫ్యాషన్ మర్కండైజ్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముంబై పోలీస్ అనే బ్రాండ్‌ను ( Fashion Brand ) రిజిస్టర్ చేశారు. షర్టులు, ప్యాంట్లు, క్యాప్స్, స్వెట్టర్, వాటర్ బాటిల్స్, పెర్‌ఫ్యూమ్స్ వంటి వాటిని ఈ బ్రాండ్ కింద అమ్మబోతున్నారు. ఏప్రిల్ నెలాఖరులో మార్కెట్లోకి రానున్నాయి. 


ఈ విషయాన్ని ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే ( Mumbai Police Commisionar ) తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. అంతే కాదు.. కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. అన్ని ప్రముఖ దుకాణాల్లోనూ ముంబై పోలీస్ బ్రాండ్ ఫ్యాషన్ వస్తువులు అమ్ముతారని చెబుతున్నారు. అయితే ఈ బ్రాండ్ ద్వారా వచ్చే మొత్తాన్ని పబ్లిక్ వేల్ఫేర్ ఫండ్‌కు పంపుతామని ఆయన చెబుతున్నారు. దుస్తుల విషయంలో పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్ యూనిఫాంలాగా ( Police uniform ) కనిపించే వాటిని అమ్మకూడదని.. రూపొందించకూడదని నిర్ణయించారు. అన్ని రకాల ప్రభుత్వ నియమ నిబంధనలను అమలు చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే ముంబై పోలీస్ బ్రాండ్ పేరుతో టోపీలు రెడీ అయ్యాయి. వాటిని షోరూంలకు సప్లయ్ చేస్తున్నట్లుగా ముంబై పోలీస్ కమిషనర్ ప్రకటించారు. 


ముంబై పోలీస్ బ్రాండ్ పేరుతో  ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటిని ఎంత ధరలకు అమ్మాలన్నదిఇంకా ఫైనలైజ్ చేయలేదు. అయితే ముంబై పోలీస్ పేరును బ్రాండ్‌గా మారిస్తే.. అందరూ వాటిని కొని.. ధరించి తామే ముంబై పోలీసులమని భ్రమపడేలా చేసి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. అందుకే పోలీసులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండేందుకు.. ఖాకీ రంగు మర్కండైజ్ తో మాత్రం ఉత్పత్తులు ఉండబోవని చెబుతున్నారు. 


మొత్తంగా ముంబై పోలీసులు వినూత్నమైన ఆలోచనే చేశారు. ఇతర దేశాల్లో చాలా వరకూ పోలీసుల పేరుతో బ్రాండ్లు ఉన్నాయి. అలాంటివి ఇండియాలో లేవు. కానీ ఇప్పుడు ముంబై పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ బ్రాండ్ సక్సెస్ అయితే..  తర్వాత హైదరాబాద్ పోలీసులు.. ఢిల్లీ పోలీసులు.. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది.