బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ ఇప్పటికే నాలుగు వారాలను పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో సరయు ఎలిమినేట్ కాగా.. ఐదో వారం ఎలిమినేషన్ కోసం సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో హౌస్ మేట్స్ ఒకరిపై మరొకరు ఫైర్ అవుతూ కనిపించారు. గత వారం హౌస్ లో జరిగిన సంఘటనలను తీసుకొచ్చి నామినేషన్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా తేజస్వి.. అరియానా విషయంలో అషురెడ్డిని లాక్ చేసి ఆమెకి షాకిచ్చింది. 


టీమ్ గా ఎవరూ కూడా అరియానాను ఏడిపించాలని.. మొక్కని పాడు చేయమని చెప్పలేదంటూ కౌంటర్ వేసింది. ఆమెకి ఫ్రెండ్ అని చెప్పుకుంటూనే ఆమెని బాధపెట్టావ్ అంటూ అషురెడ్డిని లాక్ చేసింది తేజస్వి. దీంతో అషుకి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. అలానే నటరాజ్ మాస్టర్ ని కూడా టార్గెట్ చేసింది తేజస్వి. ఇక అఖిల్ అండ్ టీమ్ మహేష్ విట్టాని, యాంకర్ శివ, బిందులను టార్గెట్ చేసింది. బిందు మాధవి యాటిట్యూడ్ పై అషురెడ్డి ఫైర్ అయింది. ఈసారి నామినేషన్స్ లో యాంకర్ శివ, మిత్రాశర్మలకు మధ్య పెద్ద గొడవ జరిగింది. 


యాంకర్ శివ.. మిత్రాను ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు. ఆమె ప్రతి మాటకి కౌంటర్ ఇచ్చాడు. 'నువ్ ఫేక్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి కానీ నిన్ను ఫేక్ అంటే నువ్ తీసుకోలేవంటూ' మిత్రాపై మండిపడ్డాడు శివ. అలానే మిత్రాకు ఏదైనా విషయం చెబితే ఆమె పక్కవాళ్లకు ఆ విషయాన్ని మోస్తుందనే అనుమానం ఉందంటూ ఆమెని నామినేట్ చేశాడు. ఇక మహేష్ విట్టా.. చిన్న చిన్న కారణాలకు నామినేట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. 


మిత్రాశర్మ, మహేష్ ల మధ్య కూడా వాదన జరిగింది. అఖిల్ తో కూడా గొడవ పడ్డాడు మహేష్ విట్టా. స్రవంతి తనను నామినేట్ చేస్తుంటే.. 'నామినేషన్స్ లో కూడా నువ్వు వెళ్లి అఖిల్ వెనకాల దాక్కున్నావ్' అంటూ మండిపడ్డాడు. ఈసారి ఎక్కువ ఓట్లు మహేష్ విట్టాకు పడినట్లు తెలుస్తోంది. గతవారం మాదిరి ఈ వారం కూడా దాదాపు ఏడుగురు నామినేషన్ లో ఉన్నారని టాక్. ఈ వారం నటరాజ్ మాస్టర్ కెప్టెన్ కాబట్టి ఆయన్ని నామినేట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఆయన నామినేషన్స్ తప్పించుకున్నారు. 


Also Read: అమెజాన్ ప్రైమ్ లో 'రాధేశ్యామ్', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


Also Read: ప్రభాస్ 'రాధే శ్యామ్', తాప్సి 'మిషన్ ఇంపాజిబుల్', హిందీలో రకుల్ 'అట్టాక్' - ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజులు