బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో మొదటివారంలో హౌస్ నుంచి ముమైత్ ఎలిమినేట్ కాగా.. రెండోవారం ఎలిమినేషన్ లో శ్రీరాపాక బయటకొచ్చేసింది. మూడో వారంలో ఊహించని విధంగా ఆర్జే చైతు ఎలిమినేట్ అయ్యాడు. ఇక నాల్గో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసిన నాగార్జున హౌస్ మేట్స్ తో కొన్ని గేమ్స్ ఆడించారు. అలానే వారు గత వారంలో ఎలా గేమ్ ఆడారో దాని గురించి మాట్లాడారు. 


అఖిల్-హమీదల గొడవను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అలానే ఒక్కో హౌస్ మేట్ కి క్లాస్ పీకారు. అనంతరం నామినేషన్స్ లో ఉన్న ఒక్కో కంటెస్టెంట్ ని సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్ గా మిత్రాశర్మ, సరయు నామినేషన్స్ లో మిగలగా.. వారిద్దరితో ఓ గేమ్ ఆడించి సరయు ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఆమె తెగ బాధపడిపోయింది. 


'లాస్ట్ మూమెంట్ వరకు నేను ఫైట్ చేశాను.. నన్ను మాటలు అని ఇప్పుడు నన్నే బయటకు పంపించేస్తున్నారు' అంటూ నటరాజ్ మాస్టర్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది సరయు. ఆ తరువాత హమీదను హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. హౌస్ మేట్స్ అందరూ సరయుని ఓదారుస్తూ.. ఆమెకి టాటా చెప్పారు కానీ అరియానా మాత్రం దగ్గరకు కూడా వెళ్లలేదు. స్టేజ్ పైకి వెళ్లిన సరయు.. అరియానాను టార్గెట్ చేస్తూ మాట్లాడింది. అలానే తేజస్వి స్క్రీన్ స్పేస్ మొత్తం తీసుకోవాలని చూస్తుంటుందని చెప్పింది. నటరాజ్ మాస్టర్ తో ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్లనే అపార్ధం చేసుకుంటారని చెప్పారు.