Tirupati News : తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్.వి.పురం టోల్ ప్లాజా వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్స్ టోల్ గేట్ సిబ్బందిపై దాడికి దిగ్గారు. పుత్తూరు ప్రైవేట్ కళాశాలలో లా చదువుతున్న తమిళనాడు విద్యార్థులు తిరుపతిలో కొద్ది రోజులుగా పరీక్షల రాస్తున్నారు. ఈ క్రమంలో‌ శనివారం పరీక్షలు చివరి రోజు కావడంతో తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో వడమాలపేట ఎస్.వి.పురం టోల్ ప్లాజా వద్ద లా విద్యార్థి కారు టోల్ రుసుము చెల్లింపులో టోల్ యాజమాన్యం సిబ్బందితో గొడవ దిగారు. రుసుము చెల్లించడానికి ఆ వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ లో డబ్బులు లేనందున టోల్ సిబ్బంది వాహనాన్ని వెనక్కి తీసి మిగిలిన వారికి దారి వదలమని చెప్పడంతో మాట మాట పెరిగి తమిళనాడు విద్యార్థులు మొదటగా సిబ్బందిపై హెల్మెట్ తో దాడి చేశారు. 


స్థానికులపై దాడి 


రుసుము చెల్లింపు జరగకపోవడం గొడవకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. వడమాల పేట ఎస్ఐ రామాంజనేయులు లా విద్యార్థులతో  జరిగిన సంఘటనపై కంప్లైంట్ ఇవ్వమని పబ్లిక్  వాహనాలకు ఇబ్బంది కలగకుండా పక్కకు రమ్మని చెప్పినప్పటికీ విద్యార్థులు మొండిగా వ్యవహరించడమే కాకుండా టోల్ ప్లాజా సిబ్బంది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాహనాలకు దారి ఇవ్వకపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లా విద్యార్థులు మరింతగా రెచ్చిపోయి పోలీసులతో గొడవకు దిగారు. అంతే కాకుండా టోల్ ప్లాజా ప్రదేశానికి చేరుకున్న స్థానికులపై లా కళాశాల విద్యార్థులు దాడికి దిగారు. దీంతో స్థానికులు లా కళాశాల విద్యార్ధులపై తిరగబడడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. లా విద్యార్థులు ప్రాంతీయ భావాన్ని పదే పదే వ్యక్త పరుస్తూ టోల్ గేట్ లైన్లో తమిళనాడు వాహనాలకు దారి వదులుతూ ఏపీకి సంబంధించిన వాహనాలను నిర్బంధిస్తూ ధర్నాకు దిగారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని వనమాలపేట ఎస్సై రామాంజనేయులు తెలిపారు. 


పంతంగి టోల్ ప్లాజా వద్ద 


మునుగోడు ఉపఎన్నికతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను సోదాలు చేస్తున్నారు. శుక్రవారం పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో  ఓ కారులో  పెద్ద మొత్తంలో భారీగా డబ్బు గుర్తించారు. కారులో సుమారు రూ.20 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. నగదు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.  మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో చల్మెడ క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో ఓ కారులో రూ.కోటి నగదును తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. రెండురోజుల క్రితమే గట్టుప్పల్ శివారులో రూ.19 లక్షలు నగదును సీజ్ చేశారు.  గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్లే దారిలో పోలీసుల తనిఖీలు చేయగా బ్రీజా కారులో రూ.19 లక్షలు తరలిస్తుండటంతో పోలీసులు పట్టుకున్నారు.   


Also Read : Chittoor Accident : మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ వాహనం ఢీకొని యువకుడు మృతి


Also Read :  ఐటీ ఉద్యోగిపై సామూహిక అత్యాచారం, బాయ్‌ఫ్రెండ్‌తో బైక్‌పై వెళ్తుండగా అడ్డగించిన దుండగులు