26-year-old software engineer raped:
ఝార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌బమ్‌లో ఘటన
ఝార్ఖండ్‌లో దారుణం జరిగింది. ఓ 26 ఏళ్ల యువతిపై దాదాపు 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వెస్ట్ సింగ్‌బమ్ జిల్లాలో జరిగిందీ ఘటన. బాధితురాలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో చేస్తున్న యువతి...సాయంత్రం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి టూవీలర్‌పై బయటకు వచ్చింది. ఇద్దరూ బైక్‌పై వెళ్తుండగా ఓ 10 మంది వచ్చి వారిని అడ్డగించారు. యువకుడిపైదాడి చేసిన ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి అత్యాచారం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన వెనక ఉన్నదెవరో విచారణ కొనసాగుతోందని ఎస్‌పీ తెలిపారు. ఓ బడా ఐటీ కంపెనీలో బాధితురాలు ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పారు. అత్యాచారం చేశాక యువతిని అక్కడే వదిలేసి పారిపోయారని, ఆమె వాలెట్, మొబైల్ ఫోన్‌ని చోరీ చేశారని పోలీసులు వివరించారు. ఏదో విధంగా అక్కడి నుంచి బయటపడిన బాధితురాలు...ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులతో అంతా వివరించింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదర్ హాస్పిటల్‌లో బాధితురాలికి మెడికల్ చెకప్ నిర్వహించారు.
ఘజియాబాద్‌లోనూ..
ఢిల్లీలోని ఘజియాబాద్‌లో నిర్భయ తరహా ఘటన జరిగిందన్న వార్తలు కలవర పెట్టాయి. ఓ మహిళను ఐదుగురు సామూహిక అత్యాచారం చేయటంతో పాటు ప్రైవేట్ పార్ట్‌లో రాడ్‌ను జొప్పించారన్న వార్తపై మహిళా సంఘాలు తీవ్రంగా మండి పడ్డాయి. పోలీసులు మాత్రం ఈ ఘటనపై ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. విచారణ కొనసాగిస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు విచారణ పూర్తయ్యాక...ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ "అత్యాచారం" అంతా కట్టుకథ అని తేల్చి చెప్పారు. భూ వివాదంలో పరిష్కరించుకునేందుకే మహిళ కిడ్నాప్, అత్యాచారం నాటకం ఆడిందని వెల్లడించారు. ఈ డ్రామాలో ఆమెకు సహకరించిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం
ఉన్న నలుగురిని కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరి నలుగురికీ క్లీన్ చిట్ ఇస్తారా అన్న ప్రశ్నకు పోలీసులు సమాధానమిచ్చారు. "వారికి వ్యతిరేకంగా ఇంత వరకూ ఎలాంటి ఆధారాలు లభించ లేదు. అసలు వాళ్లు చెప్పిందేదీ అక్కడ జరగలేదు. అలాంటప్పుడు అందుకు సంబంధించిన ఆధారాలు దొరికే అవకాశమే లేదు" అని స్పష్టం చేస్తున్నారు. మహిళను నిజంగానే కిడ్నాప్ చేశారా అని అడగ్గా..."ఆమె తనంతట తానుగానే వెళ్లింది" అని బదులిచ్చారు. వాళ్ల చాట్ ఆధారంగా ఈ కేసుని ఛేదించినట్టు వెల్లడించారు. అంతే కాదు. ఈ కట్టుకథను అల్లేందుకు ఆ మహిళ ఆ నలుగురికి డబ్బు కూడా ఇచ్చినట్టు తేలింది. రెండ్రోజుల పాటు ఐదుగురు తనను అత్యాచారం చేశారని మహిళ ఆరోపణలన్నీ పోలీసులు అవాస్తవం అని వెల్లడించారు.
Also Read: KTR Requests Harish Rao: బావా ఓ రిక్వెస్ట్, సాయం చేయాలంటూ హరీష్ రావుకు కేటీఆర్ ఫోన్