KTR Requests Harish Rao: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పెద్ద మనసు చాటుకున్నారు. సాయం కోరిన యువతికి హెల్ప్ చేయాలని కోరుతూ మంత్రి హరీష్ రావుకు కాల్ చేశారు. యువతికి సాయం చేయాలని ఓ మంత్రి మరో మంత్రికి కాల్ చేసి వివరాలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో శుక్రవారం పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


తండ్రితో పాటుగా మంత్రిని కలిసిన యువతి
పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం ముగిసిన తరువాత మునుగోడు నియోజకవర్గం గట్టుపల్ కు చెందిన యశోద (27) అనే యువతి తన తండ్రితో కలిసి మంత్రి కేటీఆర్ ను కలిశారు. గట్టుప్పల్ లో పీహెచ్‌సీ కేంద్రం వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. ఇదివరకు లేదని, ఇటీవల పీహెచ్‌సీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యశోద అంగవైకల్యంతో బాధపడుతుంది. అయినా చదువను అశ్రద్ధ చేయలేదు. తాను చదువుతున్నానని, తనకు ఉద్యోగం కావాలని మంత్రి కేటీఆర్ ను సాయం కోరింది. తన కుటుంబ పరిస్థితిని యువతి వివరించడంతో పెద్ద మనసుతో కేటీఆర్ స్పందించి ఆమెకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.


వివరాలు అడిగి, సాయం చేసిన కేటీఆర్ !
తనకు ముగ్గురు కుమార్తెలని, యశోద చిన్న కుమార్తె అని మంత్రికి చెప్పారు యువతి తండ్రి. పెద్ద కుమార్తెలకు వివాహం చేశానని చెప్పారు. నీకు ఏం కావాలి. చదువుకుంటావా, జాబ్ చేస్తావా అని అడిగారు. గట్టుప్పల్ లో ఏఎన్ఎం గా చేస్తవా, జీఎన్ఎం చేస్తవా అని మంత్రి కేటీఆర్ అడిగితే జీఎన్ఎం గా సేవలు అందిస్తానని సాయం కోరింది. తన ఫోన్ లో సిగ్నల్ లేకపోతే, తన వద్ద ఉన్న వారికి చెప్పగా మంత్రి హరీష్ రావుకు కాల్ చేసిచ్చారు. 






బావా ఓ రిక్వెస్ట్.. గట్టుప్పల్ నుంచి ఓ అమ్మాయి వచ్చింది. అమ్మాయి చాలా బాగా చదువుకుంది. గతంలో కామినేనిలో పనిచేసింది. చండూరులో జీఎన్ఎం పోస్ట్ ఖాళీగా ఉందంట. ఈ అమ్మాయి వివరాలు నీకు వాట్సాప్ చేస్తాను. యువతికి జాబ్ ఇచ్చి సాయం చేయాలని ఫోన్ కాల్ లో కోరారు మంత్రి కేటీఆర్. వివరాలు చూసి అమ్మాయికి సాయం చేస్తామని 


మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. గుజరాత్ దొంగలు డబ్బులు పంచినా, మీకు బంగారం ఇచ్చినా తీసుకోవాలని ఓటర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు. అయితే ఓటు మాత్రం ఆలోచించి వేయాలని, మీ కోసం పనిచేసే పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. ఫ్లోరోసిస్ భూతాన్ని ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని గెలిపించుకోవాలని మునుగోడు ఓటర్లను మంత్రి కేటీఆర్ కోరారు.


Also Read: మునుగోడులో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదు - ఆస్ట్రేలియాలో వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు