Crime News :   రోడ్డు మీద ఏది కనిపిస్తే అది తీసుకెళ్లిపోయేంత కరువు వచ్చేసింది దొంగలకు. రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న బైకులు.. కార్లు...అవి కాకపోతే కనీసం లూనా లేకపోతే మోపెడ్ లాంటివి దొంగతనం చేసుకెళ్తారు. అలాంటివేమీ దొరకలేదేమో కానీ ఆ దొంగలు దుకాణం ముందు ఉన్న ఓ రిక్షాను దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు. గుంటూరు జిల్లా పాత మంగళగిరిలో ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది.


కట్టుబట్టలే మిగిలినా "డేటింగ్ యాప్" మత్తులోనే పెద్ద డాక్టర్ - మగాళ్లే అని చెప్పినా వినడే !


పాత మంగళగిరిలో  అన్నపూర్ణ థియేటర్ సమీపాన గల గజలక్ష్మి ట్రేడర్స్ అనే సిమెంట్ దుకాణం ఉంది. ఆ దుకాణ యజమాని తమ వద్ద సరుకు కొన్న వారికి డెలివరీ చేయాడనికి ఓ బల్ల రిక్షాబండిని కూడా కొన్నారు. దాన్ని ఆయన రోజూ దుకాణం మూసి వేళ్లే ముందు తాళం వేసి దుకాణం  ముందే ఉంచి వెళ్తారు.  ఇలా వెళ్లిన ఆయనకు తర్వాత రోజు ఉదయం వచ్చి చూస్తే కనిపించ లేదు. అయితే ఎటు పోయిందో తెలుసుకోవడానికి ఆయనకు పది నిమిషాలే ప ట్టింది. ఎందుకంటే ఆయన దుకాణం ముందు సీసీకెమెరాలు పెట్టి ఉన్నాడు. 


ఆగని ఆన్‌లైన్ లోన్‌ యాప్‌ వేధింపులు, వివాహిత బలవన్మరణం - వాట్సప్‌లో అసభ్య మెసేజ్‌లు!


దుకాణంలోకి వెళ్లి సీసీ కెమెరా రికార్డింగ్‌ను రివైండ్ చేసుకుని చూస్తే ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు దర్జాగా రిక్షాను తీసుకెళ్లిపోవడం కనిపించింది.  రిక్షాను ఎవరు దొంగతనం చేస్తారులే అనుకున్న ఆ దుకాణ యజమానికి దొంగలు ఇచ్చిన షాక్‌తో మైండ్ బ్లాంక్ అయింది. సీసీ టీవీ ఫుటే్జీతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.   ఓ ఆటో  లో వచ్చిన దుండగుడు సదరు రిక్షా బండిని ఆటోకు కట్టుకొని పరారయ్యాడు. 


వివాహితపై అత్యాచారం కేసులో సీఐ నాగేశ్వరరావు అరెస్టు, ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోన్న సీఐ అక్రమాలు!


అయితే ఈ మాత్రం రిక్షాను దొంగతనం చేయడానికి అంతర్రాష్ట్ర దొంగలెవరోరారని లోకల్ దొంగల పనేనని పోలీసులకు అర్థమైపోయిదంి. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వారి  మొహాలు కనిపించకపోయినా వారి బాడీ లాంగ్వేజ్‌తోనే దొంగలెవరో ఇట్టే పట్టేసుగోలరు. అయితే పోలీసులు ఈ కేసును ఎంత సీరియస్‌గా తీసుకుంటే అంత త్వరగా పట్టుకుంటారు. లేకపోతే ఈ దొంగలు ఇంత దరిత్రులేమిటి అని లైట్ తీసుకుంటారేమోచూడాలి .