No PaniPuri : చిటపట చినుకులు పడుతూ ఉంటే... తమకు ఇష్టమైన సమోసాలో బజ్జీలో తినాలని చాలా మంది అనుకుంటారు. ఈ జాబితాలో ఉండే ఫుడ్ ఐటమ్స్‌లో పానీపూరి కూడా ఉంటుంది. వర్షాలు లేకపోయినా పానీపూరి క్రేజేవేరు. వర్షాలు ఉన్నా ఎవరూ తగ్గరు. అయితే వర్షాకాలంలో పానీ పూరి తినడం చాలా డేంజర్. ఇప్పుడు అసలు తినవద్దని సలహా ఇస్తున్నారు తెలంగాణ డీఎంహెచ్‌వో శ్రీనివాసరావు. ఎంత వర్షాలు పడితే మాత్రం పానీపూరి మాత్రమే డేంజరా అని... ఫ్యాన్స్ తిరుగుబాటుకు ప్రయత్నించవచ్చు కానీ కాస్త సావధానంగా ఆలోచిస్తే పెద్దాయన ఊరకే చెప్పడని అర్థం చేసుకోవచ్చు.
పానీ పూరి మీద సోషల్ మీడియాలో చాలా జోక్స్ ఉంటాయి. పానీ పూరిలో ఏమేమి ఉంటాయంటే... అనీ ఐటమ్స్ చెబుతారు.. చివరికి ఏం చేస్తారు అంటే... నీళ్లో ముంచి ఇస్తాడు పానీపూరివాలా. ఆ విషయం మాత్రం ఎవరూ చెప్పరు.. గుర్తుంచుకోరు. కానీ అక్కడే అసలు విషయం ఉంది. ఖచ్చితంగా దాని వల్లే రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. పానీపూరీలు చేసే స్థలం పరిశుభ్రంగా లేకపోయినా తయారు చేసే వ్యక్తికి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా వైరస్ బారిన పడిన అవి మీకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలంలో నీరు ఎక్కువ కలుషితంగా ఉంటాయి కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.
పానీపూరిల తయారీ కూడా డౌట్‌ఫుల్‌గా ఉంటే తినకపోవడం మంచిదే. పానిపురి కి ఉపయోగించే నూనె మంచిది కాకపోతే ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టినట్లే. ఒకసారి వేడి చేసిన నూనె ఎక్కువగా సార్లు వేడి చేసి ఉపయోగిస్తే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. పానీపూరి లో పాన్ మసాలా కలుపుతారు. ఇది క్యాన్సర్ కు కారణం అవుతుంది. పానీ పూరి లో సోడియం ఎక్కువగా ఉంటుంది. పానీ పూరి కి ఉపయోగించే పదార్థాలు మైదా బేకింగ్ సోడా తో తయారు చేస్తారు ఇవి తినడం వలన శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటిని తరచూ తీసుకుంటున్నా.. ప్రతి రోజూ మీ డైట్ లో భాగంగా చేస్తున్నా బరువు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వీటిని తింటే మధుమేహం కూడా వస్తుంది. ఇంకా అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.
మామూలు రోజుల్లో అయితే చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్లకు మన బాడీ తట్టుకుంటుంది కానీ వర్షాకాలం అయితే కష్టం. ఉరకనే వైరల్ వ్యాధులు వచ్చేస్తాయి. అందుకే డీఎంహెచ్‌వో చెప్పినట్లుగా కొంత కాలం పానీపూరిగా దూరంగా ఉంటే.. ఆరోగ్యానికి దగ్గరగా ఉన్నట్లే.