‘‘నా భర్త చెన్నకేశవులు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. దిశ కేసులో అరెస్టయిన తర్వాత పోలీసులే అనారోగ్య విషయాన్ని మాకు చెప్పారు. నిలబడలేకపోతున్నాడ ని సమాచారం ఇచ్చారు. అలాంటప్పుడు చెన్నకేశవు లు పోలీసులపై ఎదురుకాల్పులుఎలా జరుపుతాడు? నా భర్తను పోలీసులే హత్య చేశారు. మా కుటుంబానికి న్యాయం చేయండి’’ అని విచారణ కమిషన్ ఎదుట దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక వాపోయింది. త్రిసభ్య కమిషన్ విచారణలో భాగంగా మంగళవారం ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. ‘దిశ’ హత్య కేసులో తన భర్తను పోలీసులు పట్టుకెళ్లిన తర్వాత జైలులో పలుమార్లు కిందపడిపోయాడన్నారు. ఎందుకు ఇలా పడిపోతున్నాడని అడిగితే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని చెప్పానని.. అందుకు సంబంధించిన ఆసుపత్రి రికార్డులు పంపించానని వెల్లడించింది. అలా సరిగా నడవడమే రాని తన భర్త ఎన్‌కౌంటర్ సమయంలో పోలీసులపై ఎలా తిరగబడతారని కమిషన్ ముందు నిలదీసింది.
Also Read : చిన్నారిపై హత్యాచార నిందితుడిపై భారీ రివార్డ్.. పట్టిస్తే రూ.10 లక్షలు..
పోలీస్ తరఫు న్యాయవాదులు ఆమెను క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ.. ‘దిశ’ అత్యాచారం సమయంలో ముగ్గురు యువకులు నడుస్తూ వెళ్తున్న సీసీ ఫుటేజీని చూపించారు. అందులో చెన్నకేశవులును గుర్తుపట్టగలరా..? అని ప్రశ్నిస్తే ఆమె గుర్తు పట్టింది. ఎన్‌కౌంటర్ అనంతరం ఆమె ప్రసవం జరిగినప్పుడు ఆసుపత్రి రికార్డుల్లో వయసు ఎక్కువగా ఎందుకు నమోదు చేయించారని ప్రశ్నించారు. ఆ సమయంలో వయసు తక్కువ అని చెబితే ఇబ్బంది వస్తుందనే అలా నమోదు చేయించానని ఆమె వాంగ్మూలమిచ్చారు. పాఠశాలలో విద్యార్థుల వయసును ఎలా నమోదు చేస్తారని చెన్నకేశవులు చదివిన గుడిగండ్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింహులును స్టేట్ కౌన్సిల్ సురేందర్‌రావు విచారించారు. చెన్నకేశవులు వయసును ఆయన కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే నమోదు చేశామని నర్సింహులు తెలిపారు. మరో మూడు రోజులపాటు ఈ విడత విచారణ జరగనుంది. ఎన్‌కౌంటర్ మృతులు జొల్లు నవీన్, శివ కుటుంబసభ్యుల వాంగ్మూలాలతోపాటు వారు చదివిన పాఠశాల ఉపాధ్యాయుల్ని కూడా విచారించనున్నారు.
Also read: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు
Also Read: యాపిల్ కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. అదిరిపోయే హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు!
Also read: ఐఫోన్ 13 సిరీస్ వచ్చేసింది.. ముందు వెర్షన్ల కంటే తక్కువ ధరకే!
Also read: ఈ రోజు ఈ రాశులవారికి ఒత్తిడి తొలగిపోతుంది..వారు ఆనందంగా ఉంటారు, ఏ రాశి వారికి ఎలా ఉందంటే...