2021 సెప్టెంబరు 15 బుధవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగస్తులు పనిలో ప్రశంసలు అందుకుంటారు. మీ వ్యక్తిత్వంతో ప్రత్యర్థులను కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. స్నేహితులను కలుస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి.
వృషభం
కొన్ని విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలు తలకెత్తుకుంటారు. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పెట్టుబడికి మంచి సమయం కాదు. దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వివాదంలో భాగం కావొద్దు.
మిథునం
మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పనిలో విజయం సాధిస్తారు. అనవసర మాటలు వద్దు. ఖర్చులు నియంత్రించండి. కుటుంబ సభ్యుల చిన్న చిన్న అవసరాలు తీర్చడంపై శ్రద్ధ చూపండి. బంధువులను కలుస్తారు.
కర్కాటక రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. లాభం-నష్టం రెండూ ఉండొచ్చు. కోపాన్ని తగ్గించుకోండి. ఇంట్లో వృద్ధుల ఆరోగ్యం క్షీణించవచ్చు. అన్ని విషయాలు భాగస్వామితో పంచుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
Also read: ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందంటే..
సింహం
ఏదో ఒక విషయంలో ఇబ్బంది ఉన్నప్పటికీ వెంటనే పరిష్కారం లభిస్తుంది. మీ అవసరాలు తీరుతాయి. మీరు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. వ్యాపార రంగంలో కొత్త ప్రణాళికలు రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి.
కన్య
పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికావడంతో సంతోషంగా ఉంటారు. ఈ రోజంతా బావుంటుంది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందిృ. వ్యాపార పరిస్థితులు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి.
తులారాశి
మీ పని చాలా వరకు పూర్తవుతుంది. శుభవార్త వింటారు. వ్యాపారం బాగానే ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు సరైన సమయం కాదు. అవివాహితుల కోసం సంబంధాలు చూసేందుకు మంచి సమయం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
వృశ్చికరాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. లావాదేవీలకు దూరంగా ఉండాలి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఈరోజు పిల్లలతో సమయం గడపండి.
Also Read: నానికి ఏమైంది? నటన అదుర్స్.. కథలూ బాగున్నాయ్.. మరి హిట్టెందుకు ముఖం చాటేస్తోందో!
ధనుస్సు
మీకు మంచి రోజు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. సంతోషంగా ఉంటారు. మీ ప్రేమను వ్యక్తపరచండి. ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో పంచుకోండి.
మకరం
ఈరోజు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. అతిగా ఖర్చు చేయడం వల్ల ఒత్తిడికి గురవుతారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే కొత్త ఆలోచనలు వస్తాయి. విజయం కోసం మీరు కష్టపడాలి. కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. రుణ మొత్తాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది.
కుంభం
రావాల్సిన మొత్తం చేతికందుతుంది. ఈరోజు మంచి రోజు అవుతుంది. అదృష్టం కలిసొస్తుంది. మీలో సానుకూల మార్పులుంటాయి. ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది. డబ్బు సంపాదించే సంకేతాలు ఉన్నాయి. ఈరోజు శుభవార్త వింటారు.
మీనం
వ్యాపారులకు ఈ రోజు కలిసొస్తుంది. మీకు సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపండి. విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు. ఆరోగ్యం బాగుంటుంది.