దర్శకుడు అవుదామనుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంద్రగంటి మోహనకృష్ణ అవకాశం ఇవ్వడంతో ‘అష్టాచమ్మా’తో హీరోగా నిరూపించుకున్నాడు నాని. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నాని నటించిన సినిమాలు హిట్టా-ఫ్లాపా అన్నది పక్కనపెడితే నటనపరంగా ఒక్క మైనస్ మార్క్ కూడా లేకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రేక్షకులకైతే నాని పక్కింటి కుర్రాడే అనిపిస్తాడు. ఓ దశలో నానితో సినిమా అంటే సేఫ్ అని నిర్మాతలు ఫిక్సైపోయారు. మీడియం బడ్జెట్ సినిమాలకు, కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అయ్యాడు. ఎంత మంది హీరోలున్నా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఐదేళ్లుగా నానికి లక్కు కలసి రావడం లేదో ఏమో ఆశించిన స్థాయిలో విజయాన్నందుకోలేకపోతున్నాడు.
2017లో వచ్చిన ‘నిన్నుకోరి’ తర్వాత నానికి మంచి హిట్టు దక్కలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాని, నివేదా థామస్, ఆది నటించారు. ఈ మూవీ కూడా ఆరంభంలో కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాతి నుంచి న్యాచురల్ స్టార్‌కు సూపర్ హిట్ అనే మాట మఖం చాటేసింది. ‘ఎం.సి.ఎ’,’ కృష్ణార్జున యుద్దం’, ‘దేవదాస్’, ‘నానీస్ గ్యాంగ్ లీడర్’, ‘వి’ సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. నాని-సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ‘MCA’ సినిమాకి ప్లస్ కావడంతో భారీ హిట్ కాకపోయినా నిర్మాతకి మాత్రం మంచి లాభాలను తీసుకువచ్చింది. అలాగే ‘జెర్సీ’ సినిమాకు రెండు జాతీయ అవార్డులొచ్చాయి. బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డు కూడా దక్కించుకుంది. ఈ చిత్రం ద్వారా నానికి మంచి పేరు వచ్చింది. కానీ, నిర్మాతలకు ఆశించిన స్థాయిలో లాభాలు రాలేనట్లు టాక్. కానీ, ఇది నాని కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఈ ఐదేళ్లలో నానికి ఈ చిత్రం కాస్త ఉపశమనం కలిగించినట్లే.
నానిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరెకెక్కిన ‘వి’ సినిమా కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో ఓటీటీలో రిలీజైంది. నిర్మాత దిల్ రాజుకి 10 కోట్లు లాభం వచ్చిందని ప్రచారం జరిగిన ఆ తర్వాత అది నిజం కాదన్నారు. ఇప్పుడు ‘టక్ జగదీష్’ విషయంలోనూ అదే జరిగింది. ‘వి’ సినిమాతో పోల్చితే ‘టక్ జగదీశ్’ టాక్ పాజిటివ్ గానే ఉంది. కుటుంబ కథా చిత్రం కావడంతో ఓటీటీలో ఫ్యామిలీ అంతా కలసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా కూడా హిట్ అని చెప్పుకోలేని పరిస్థితి. అయతే, నిర్మాతలు ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇవ్వడం ద్వారా నష్టాల నుంచి తప్పించుకున్నట్లేనని తెలుస్తోంది.
వాస్తవానికి నానికి యూత్ కన్నా కుటుంబ ప్రేక్షకుల్లోనే ఫాలోయింగ్ ఎక్కువ. అదే తన బలం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ..సినిమా ఫెయిలైనా కథల ఎంపికలో మాత్రం నాని ఫెయిలవలేదు. కొన్నిసార్లు మంచి కథలు కూడా మంచి ఫలితాన్నివ్వవు. సినిమా హిట్టవ్వడానికి-ఫ్లాప్ అవడానికి రకరకాల కారణాలుంటాయి. కానీ జడ్జిమెంట్ అనేది చాలా కీలకమైన విషయం. ఎప్పుడు ఎలాంటి కథ చేయాలి? ఏ దర్శకుడితో చేయాలి అనే విషయం హీరోకి క్లారిటీ ఉండాలి. ఈ మధ్యకాలంలో నానికి ఆ క్లారిటీ లోపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఫ్లాపులకు ఇదే కారణం అంటున్నారంతా.
Also Read: ‘లవ్ స్టోరీ’లో ఆ డైలాగ్‌తో.. తెలంగాణ ప్రభుత్వానికి సెటైర్?
Also read: అపోలో ఆసుపత్రికి కృష్ణంరాజు.. కంగారు పడొద్దన్న రెబల్ స్టార్ టీమ్
Also read: సమంతకు థాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా..!