ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి స్మగ్లింగ్ ఏ మాత్రం ఆగడం లేదు. లారీలకు లారీలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో పోలీసులు పట్టుకోవడం లేదు కానీ.., సరిహద్దులు దాటంగానే ఇతర రాష్ట్రాల పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులో 1,820 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పది టైర్ల లారీలో ఎరువులు రవాణా చేస్తున్నట్లుగా పైపైన ఎరువుల బస్తాలు పెట్టి.. అడుగున మాత్రం గంజాయి ప్యాకెట్లు పెట్టారు. ఖచ్చితమైన సమాచారం రావడంతో పోలీసులు వాహనాన్ని చెక్ చేసి.. పట్టుకున్నారు.


Also Read : దేవిరెడ్డి శంకర్ రెడ్డికి వారం రోజుల సీబీఐ కస్టడీ.. సంచలన విషయాలు బయటకు వస్తాయా ?


గంజాయి మొత్తం విశాఖలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్‌ మీదుగా తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి లారీ, కారు స్వాధీనం చేసుకున్నారు.  గంజాయి కిలో రూ.8 వేలకు విశాఖలో కొని.. మహారాష్ట్రలో రూ.15 వేలకు అమ్ముతున్నారని రాచకొండ కమిషనర్ వెల్లడించారు. నర్సీపట్నం, రాజమహేంద్రవరం, చౌటుప్పల్‌ ప్రాంతాల మీదుగా గంజాయిని షోలాపూర్‌కు తరలిస్తున్నట్లు తేలిందన్నారు.  పట్టుబడిన గంజాయి విలువ రూ.3 కోట్లకు పైగానే ఉంటుందన్నారు.


Also Read : క్రిప్టోపై బిల్లుపై కేంద్రం ప్రకటన.. సూర్యాపేటలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య


ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రలకు రవాణా చేస్తున్న గంజాయి ఇటీవల వరుసగా పట్టుబడుతోంది. వారం కింద కూడా ఇలాగే 1,200 కిలోల గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. కొన్ని లారీలు మహారాష్ట్రకు వెళ్లిపోయిన తర్వాత అక్కడా పట్టుబడ్డ ఘటనలు ఉన్నాయి. తెలంగాణ సర్కార్ గంజాయి మీద యుద్ధం ప్రకటించింది. పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారు గంజాయి సమాచారం ఎక్కడ వచ్చినా వదిలి పెట్టడం లేదు.


Also Read: వాళ్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం ఇచ్చేస్తారు ! కానీ వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసేశారు..ఎందుకో తెలుసా ?


విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి స్మగ్లింగ్‌ అవుతూ వేల కేజీల్లో గంజాయి ఇతర రాష్ట్రాల్లో పట్టుబడుతోంది. అది ఏపీ సరిహద్దుల్ని దాటి వస్తోంది.  అయినా అక్కడి పోలీసులు పట్టుకోవడం లేదు. ఇతర రాష్ట్రాల ఇంటలిజెన్స్ పోలీసులకు సమాచారం ఉంటోంది కానీ ఏపీ పోలీసులకు మాత్రం ఉండటం లేదు.


Also Read: Father Rape: మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం.. ఏడాదిగా అదే పని.. చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి