ఒడిశాలో ఘాతుకం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి రూ.లక్షకు అమ్మేశాడు. పెళ్లి జరిగిన రెండు నెలలకే ఆ వ్యక్తి తన భార్యను అమ్మేయడం పోలీసులను విస్మయానికి గురి చేసింది. ఆ వ్యక్తి చివరికి పోలీసులకు చిక్కాడు. ఒడిశాలోని బొలంగీర్‌కు చెందిన సరోజ్‌రాణాకు, సురేకెల గ్రామానికి చెందిన రేవతికి (17) 2 నెలల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరికీ ఫేస్ బుక్‌లో పరిచయం కాగా.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత భర్త సరోజ్ రాణా ఉపాధి కోసం రేవతిని తీసుకొని రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ ఓ ఇటుకల బట్టీలో ఇద్దరూ పనికి కుదిరారు. కొన్నాళ్ల తర్వాత భర్త సరోజ్‌రాణా రాజస్థాన్‌లోని ఓ కుటుంబానికి భార్య రేవతిని రూ.లక్షకు అమ్మేసి సొంత గ్రామానికి తిరిగి వచ్చేశాడు.
Also Read: మహిళ వాట్సాప్ కు నీలి చిత్రాలు... కిటికీ దగ్గర వింత అరుపులు... యువకుడి వెకిలి చేష్టలు
దీంతో రేవతి ఎక్కడుందని అతణ్ని అత్తమామలు సహజంగానే ప్రశ్నించారు. వేరే యువకుడితో వెళ్లిపోయిందని అతను బుకాయించాడు. వారు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజస్థాన్ చేరుకొన్న పోలీసులు రేవతిని కాపాడి గ్రామానికి తీసుకొచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగా వారికి గ్రామస్థుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. రోడ్లను బ్లాక్ చేసి వారిని అడ్డుకున్నారు. అతి కష్టమ్మీద రాజస్థాన్ పోలీసుల సాయంతో ఆ యువతిని కాపాడి ఒడిశా పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. సరోజ్‌రాణాను అరెస్టు చేశారు.
రేవతి మాట్లాడుతూ భర్త తనను అమ్మిన విషయం తెలియదని, ఓ ఇంట్లో పని చేయాలని చెప్పి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. భార్యను అమ్మేయగా వచ్చిన ఆ డబ్బుతో విలాసవంతమైన హోటల్‌లో భోజనం చేసి, ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె వేరే వ్యక్తితో పారిపోయిందని నమ్మబలికాడు. అతడిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది.
Also Read: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు.. డోర్ తీసి చూస్తే డెడ్ బాడీ... కూపీ లాగితే సంచలన విషయం
Also Read: మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి