#KooKiyaKya: ప్రచారంలో Koo మరో ముందడుగు.. టీ20 వరల్డ్‌కప్‌లో యాడ్స్

Koo: యూఏఈలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ ప్రసారంలో ఇకపై కూ యాడ్స్ కూడా ప్రసారం చేయనున్నారు.

Continues below advertisement

మీరు టీ20 వరల్డ్ కప్ చూడటానికి సిద్థం అవుతున్నారా? అయితే ఇండియాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’కి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్లు కూడా మిమ్మల్ని పలకరించనున్నాయి. Koo యాడ్లను వరల్డ్ కప్ మ్యాచ్‌ల సమయంలో ప్రసారం చేయనున్నారు.

Continues below advertisement

2019 నవంబర్‌లో కూ యాప్ మొదటగా లాంచ్ అయింది. హిందీ, ఇంగ్లిష్, తమిళ, తెలుగు, కన్నడ, అస్సామీస్ భాషలను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ యాప్‌తో పాటు, ఐవోఎస్ యాప్, వెబ్ వెర్షన్లలో కూడా కూని ఉపయోగించవచ్చు. ఈ యాప్‌కు 14.3 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

మనదేశంలో ట్వీటర్‌కు ప్రత్యామ్నాయం ఈ యాపే. నైజీరియాలో అయితే ట్వీటర్‌ను బ్యాన్ చేశాక అందరూ ఈ యాప్‌నే ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో ‘ఆత్మనిర్భర్’ ఇన్నోవేషన్ యాప్ అవార్డును కూడా కూనే గెలుచుకోవడం విశేషం. కూ విలువ 100 మిలియన్ డాలర్లకు పైమాటేనని తెలుస్తోంది.

కూ యూజర్ ఇంటర్ ఫేస్ కూడా ట్వీటర్ తరహాలోనే ఉంటుంది. ఇందులో వినియోగదారులు తమ యాప్స్‌ను కేటగిరీల వారీగా విభజించుకోవచ్చు. ఎల్లో, వైట్ ఇంటర్ ఫేస్‌ను కూ ఉపయోగించనుంది. టాక్ టు టైప్ ఫీచర్ కూడా కూలో ఉంది. అంటే వాయిస్ అసిస్టెంట్ ద్వారా మాట్లాడితే కూలో టైప్ అయిపోతుందన్న మాట. ఒకసారి మీ అకౌంట్ వెరిఫై అయితే కూ ఎల్లో టిక్ అందించనుంది. ఇందులో డార్క్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.

Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola