ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సీక్రెట్‌గా ఉంచిన బ్యాగులో పెద్దఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజల్ల వల్ల తనిఖీల్లో భాగంగా పోలీసులు సోదాలు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న వీరవల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో ఈ నగదు బయటపడింది. అక్రమంగా నగదు రవాణా చేస్తున్నట్లుగా గుర్తించడంతో స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. నాలుగు కోట్ల 76 లక్షలు ఉంది. బస్సు శ్రీకాకుళం నుంచి గుంటూరు వెళ్తోంది. బస్సు పద్మావతి ట్రావెల్స్ కు చెందినది. బస్ నెంబర్ ఏపీ Ap39 TB 7555 . బస్సులో పాసింజర్ సీట్ల కింద లగేజ్ కెరియర్లో ప్రత్యేక బ్యాగుల్లో ఈ నగదును తరలిస్తున్నారు.
RRR చూసి ఇంటికి బయల్దేరిన యువకుడు, రెండ్రోజులైనా రాలేదు - కూపీ లాగితే సంచలన విషయాలు, అవాక్కైన పోలీసులు!
ఎవరు ఆ లగేజీని బుక్ చేశారు.. ఎవరికి చేర వేస్తున్నారు వంటి అంశాలపై పోలీసులకు సమాధానం లభించలేదు. దీంతో బస్సు డ్రైవర్ క్లీనర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు ఆ నగదుతో సంబంధం ఉందని భావిస్తున్న మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలోనే ఇలా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తూ ఉంటారు. సోదాల్లో కోట్లకు కోట్లు దొరుకుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోయినా పెద్ద మొత్తంలో నగదును బస్సుల్లో సీక్రెట్‌గా ఎవరికీ అనుమానం రాకుండా తరలించడంతో హవావా లావాదేవీలేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.
గుప్త నిధుల వేట కోసం వెళ్లిన వ్యక్తి అలా చనిపోయాడేంటి? పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు
నోట్ల రద్దు తర్వాత రూ. రెండు లక్షల వరకూ మాత్రమే నగదు లావాదేవీలు అనుమతిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు తరలిస్తే అతి అక్రమం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏపీలో పలు చోట్ల ఇలాంటి నగదు దొరికిన ఘటనలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం గిద్దలూరు ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించిన కారులో ఇలా రూ. ఐదు కోట్ల వరకూ నగదు తీసుకెళ్తూ.. తమిళనాడు పోలీసులకు పట్టుబడిన అంశం రాజకీయంగా కలకలం రేపింది. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో పట్టుబడిన మొత్తంపై పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు. ఆ మొత్తం ఎవరిదన్న దానిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎందుకు తరలిస్తున్నారు.. ఎవరు పంపుతున్నారు.. ఎవరు రిసీవ్ చేసుకోబోతున్నారు వంటి వన్నీ వెల్లడి కావాల్సి ఉంది.