Gang Rape on Wife Before Husband: భార్యాభర్తల అనుబంధంలో ప్రతిష్ఠను దిగజార్చే హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగింది. పొలంలో ఓ మహిళపై రైతు, అతని సోదరుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ పనిని స్వయంగా ఆమె భర్తనే చేయించాడు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఔసా అనే ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అఘాయిత్యం జరిగాక బాధితురాలు ఏకంగా 10 నుండి 15 కిలోమీటర్లు నడిచి, అర్ధరాత్రి వేళ లాతూర్‌లోని రెండు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి సాయం లభించలేదు. చివరకు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఆమె భర్త సహా ముగ్గురిపై అత్యాచారం, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు, స్థానిక వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. లాతూర్ జిల్లా నిలంగా తాలూకాకు చెందిన 32 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి అవుసా తాలూకాలోని సరోలా రోడ్డులోని ఆకుల తోటలో నివసిస్తోంది. కొద్దిరోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆ మహిళ తన తల్లితో కలిసి లాతూర్‌లో ఉంటోంది. భార్యా భర్తలు ఇద్దరి మధ్యా రాజీ కుదిరాక బాధితురాలి తల్లి ఏప్రిల్ 9న ఆమెను తన భర్త వద్దకు తీసుకెళ్లి విడిచిపెట్టింది.
రాత్రి 9 గంటల ప్రాంతంలో బాధితురాలి భర్త.. ఇంటి యజమానులైన షేక్, మూసా షేక్‌లను పిలిచి తన భార్యను లైంగికంగా వేధించాలని కోరాడు. అతను చెప్పినట్లుగానే ఇద్దరు కలిసి భర్త ఎదుటే మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇక్కడ దిగ్ర్భాంతికర విషయం ఏంటంటే.. ఈ ఘటన అనంతరం బాధితురాలు ఫిర్యాదు ఇచ్చేందుకు అర్ధరాత్రి 15 కిలో మీటర్ల నడిచి బభాల్ గావ్ నాకా గ్రామ పరిధిలోని వివేకానంద చౌక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అయితే, వారు జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లాలని సూచించారు. దీంతో ఆ మహిళ తన తల్లిని వెంట తీసుకెళ్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను కలిసింది. తనపై జరిగిన అత్యాచార వివరాలను ఆయనకు విన్నవించింది. దాంతో వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్పీ ఔసా పోలీసులను ఆదేశించారు. నిందితుడైన బాధితురాలి భర్తతో పాటు మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
Also Read: పగలు బస్టాండ్ లో రాత్రికి తాళం వేసి ఇంట్లో, ఈ దొంగ టెక్నిక్ కు చెక్ పెట్టిన పోలీసులు
Also Read:మంత్రి విల్లాలో ఆ యువకుడు ఎలా చనిపోయాడు ? రెండు రోజులుగా పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు ?