India Reports 90 Percent Jump In Daily COVID Count: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గిపోగా కొవిడ్ ఫోర్త్ వేవ్ ఆందోళన మొదలైంది. దేశంలో రోజువారీ పాజిటివ్ కేసులు 90 శాతానికి పైగా పెరగడమే అందుకు ప్రధాన కారణం. గత కొన్ని రోజుల కిందటి వరకు 24 గంటల్లో వెయ్యి లోపే నమోదయ్యే కరోనా కేసులు నిన్న ఒక్కరోజులో ఏకంగా 2,183 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆదివారంతో పోల్చితే సోమవారం ఉదయానికి ఇది ఏకంగా 89.8 శాతంతో రోజువారీ పాజిటివ్ కేసులు పెరిగాయి. 


భారత్‌లో ఒక్కసారిగా రెట్టింపైన పాజిటివ్ కేసులు.. 
ఆదివారం ఉదయం గడిచిన 24 గంటల్లో 1,150 కేసులు (Coronavirus Cases India) నమోదు కాగా, తాజాగా వాటి సంఖ్య రెట్టింపుగా ఉంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. క్రితం రోజు 0.31 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు, నేటి (సోమవారం) ఉదయం 0.83 శాతానికి పెరిగాయి. వీక్లీ కొవిడ్ పాజిటివ్ రేటు 0.32శాతానికి చేరడం ఆందోళన పెంచుతోంది. డబ్ల్యూహెచ్‌వో మాత్రం కొవిడ్19 నిబంధనల్ని ఎత్తివేయడం కరోనా వ్యాప్తి పెరగడానికి కారణమై, ఫోర్త్ వేవ్ త్వరగా వచ్చే అవకాశం ఉందని పలు దేశాలను హెచ్చరించింది.







మెరుగ్గానే కొవిడ్19 రికవరీ రేటు 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకూ కోట్ల 25 లక్షల 10 వేల 7 వందల 73 (4,25,10,773) కోలుకున్నారు. కరోనా మరణాలు సంఖ్య 5 లక్షల 21 వేల 965కు చేరింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉండగా.. తాజాగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల ప్రభావంతో రికవరీ రేటు క్రమంగా తగ్గే అవకాశాలున్నాయి. నిన్న ఒక్కరోజులో 2,61,440 శాంపిల్స్‌ పరీక్షించగా.. భారత్‌లో ఇప్పటివరకూ టెస్ట్ చేసిన శాంపిల్స్ 83.21 కోట్లకు చేరుకుందని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. 


కోవిడ్ వ్యాక్సినేషన్..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 192.27 కోట్ల డోసుల కరోనా టీకాల మోతాదులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసింది. ఇందులో 20 కోట్ల మేర డోసులు రాష్ట్రాల వద్ద నిల్వ ఉన్నాయని సమాచారం. కరోనాను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ సరైన మార్గమని భారత్ భావిస్తోంది. విదేశాలకు సైతం కరోనా వ్యాక్సిన్ సరఫరా చేసి ఆపన్న హస్తం అందించింది. 


Also Read: Health tip: తీవ్రంగా బాధపడుతున్నారా? ఎవరికీ చెప్పుకోలేరా? అయితే ఇలా చేయండి


Also read: మెదడులో కణితులుంటే మూత్రపరీక్షలో ఆ విషయం పసిగట్టేయచ్చు, కొత్త అధ్యయనం ఫలితం