Attack on Realtors: హైదరాబాద్‌ శివారు ఇబ్రహీంపట్నం సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై మంగళవారం తెల్లవారుజామున (మార్చి 1) జరిగిన తుపాకీ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా మరణించారు. తొలుత గన్ పైరింగ్ జరగ్గానే శ్రీనివాస్ అనే వ్యక్తి (Realtors Murder) చనిపోగా.. రఘు అనే వ్యక్తి ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. రఘు పరిస్థితి విషమంగా ఉండడంతో అతణ్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం రఘు మృతి చెందారు.


ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో కాల్పుల ఘటన జరిగింది. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఇద్దరు భాగస్వాములైన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు (Gun Fire in Hyderabad) జరిపారు. ఈ కాల్పులతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి (Gun Fire on Realtor) మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయాలపాలు అయ్యారు. కర్ణంగూడకు వెళ్లే మార్గంలో ఓ వాహనం రోడ్డు నుంచి దిగిపోయి ఉండడాన్ని స్థానికులు గమనించారు. అందులో ఓ వ్యక్తి పడిపోయి ఉండడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కారులోని వారిని బీఎన్ రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.


Also Read: Hyderabad Gun Fire: రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తుపాకీ కాల్పులు, హైదరాబాద్ శివారులో కలకలం


వెంబడించి కాల్చారు..
ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల మేరకు.. కర్ణంగూడలోని వెంచర్ వద్దకు వెళ్లిన రియల్టర్లు శ్రీను, రఘులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శ్రీనివాస్‌పై పాయింట్ బ్లాంక్‌లో గన్‌పెట్టి ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చూసి రఘు భయంతో కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. దుండగులు అతణ్ని వెంబడించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రఘును అక్కడ ఉన్న వాళ్లు గమనించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.


Also Read: Telangana News: దేశంలోనే తెలంగాణకు టాప్ ప్లేస్, ఏడేళ్లలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా


పోలీసుల అదుపులో నిందితుడు
కాల్పుల ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనాస్థలాన్ని రాచకొండ సీపీ (Rachakonda) మహేశ్‌ భగవత్‌, ఏసీపీ బాలకృష్ణారెడ్డి పరిశీలించారు. అనుమానుతులను ప్రశ్నిస్తున్నారు. కుటుంబసభ్యుల అనుమానం మేరకు వ్యాపార భాగస్వామి అయిన మట్టారెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్​ రెడ్డి, రాఘవేందర్​ రెడ్డిపై గతంలో కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.


Also Read: Guntur: బీటెక్ స్టూడెంట్స్ గలీజు పని! ఊళ్లో అమ్మాయిల ఫోటోలు తీసి భారీగా సొమ్ము, ఆందోళనలో గ్రామస్థులు