'సర్కారు వారి పాట'... టైటిల్ క్లాస్ గా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కారులో వచ్చి పంచ్ డైలాగ్ కొట్టిన గ్లింప్స్‌లోనూ క్లాస్ టచ్ ఉంది. ఇక, 'కళావతి...' సాంగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. టూ మచ్ క్లాస్ అసలు! మరి, సినిమాలో మాస్ లేదా? ఉంది! సాలిడ్ గా ఉందని చెప్పడానికి అన్నట్టు... ఈ రోజు మాస్ పోస్టర్ విడుదల చేసినట్టు ఉన్నారు.
మాస్... మ మ మాస్... మహేష్ బాబులో మాస్ యాంగిల్ కూడా 'సర్కారు వారి పాట'లో ఉందని మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే తెలుస్తోంది. (Sarkaru Vaari Paata Movie Update) ఫైట్ సీన్ లో తీసిన ఈ స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది.
మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ (#KeerthiSuresh) కథానాయికగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 12న సినిమా విడుదల (Sarkaru Vaari Paata Release On May 12, 2022) కానున్న సంగతి తెలిసిందే. 'వెన్నెల' కిషోర్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఆర్. మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, సంగీతం: తమన్.