శ్రీరామబంటు అంటే ఎవరు? హనుమంతుడు! సీతా రాములకు దాసుడు. శ్రీ రామ భక్తుడు. ఆయున గుండెల్లో ఎప్పుడూ శ్రీరాముడు కొలువై ఉంటాడు. అదే విధంగా మహేష్ బాబుకు నమ్మిన బంటు ఎవరు? అంటే... పట్టాభి! సూపర్ స్టార్ దగ్గర మేకప్ మేన్. ఎన్నో ఏళ్ళుగా మహేష్ దగ్గర పని చేస్తున్నారు. సూపర్ స్టార్ ఫ్యామిలీ వెంట ఉంటున్నారు. పట్టాభి అంటే మహేష్ బాబుకు కూడా చాలా అభిమానం. గతంలో పట్టాభి గురించి రెండు మూడు సందర్భాల్లో చెప్పారు కూడా! ఇప్పుడు పట్టాభి తనకు ఇచ్చిన బహుమతిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
శ్రీరాముడు, హనుమంతుడు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న ఫొటోను మహేష్ బాబుకు పట్టాభి బహుమతిగా ఇచ్చారు. మహేష్ శ్రీరాముడు అయితే... తాను రామ బంటు హనుమంతుడు అనే అర్థం అందులో ఉందని ఘట్టమనేని అభిమానులు అంటున్నారు. అదీ సంగతి!
ఇక, మహేష్ బాబు చేస్తున్న సినిమాలకు వస్తే... ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'సర్కారు వారి పాట'లో 'కళావతి...' సాంగ్ ఇటీవల విడుదలైంది. దానికి శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేష్ కథానాయిక. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సర్కారు వారి పాట' విడుదలకు ముందే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమా చిత్రీకరణను మహేష్ ప్రారంభించనున్నారు.
Also Read: ప్రేమించడంలో సరిలేరు మహేష్ బాబుకెవ్వరు! లవ్ అంటే రోల్ మోడల్ సూపర్ స్టారే!