'ఏక్ మినీ కథ' సినిమాలో కథానాయికగా నటించిన కావ్యా థాపర్ ఉన్నారు కదా! ఈ రోజు (శుక్రవారం, ఫిబ్రవరి 18న) ముంబైలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నిన్న (గురువారం ఉదయం, ఫిబ్రవరి 17న) మద్యం సేవించి కారు నడపడమే కాకుండా యాక్సిడెంట్ చేశారామె. ఆ ఘటనలో ఒకరు గాయపడ్డారు. అనంతరం పోలీసులతో గొడవ పడటంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారు. జెడబ్ల్యూ మారియట్ హోటల్ ముందు ఈ ఘటన జరిగిందట.


మద్యం సేవించి వాహనం నడపటం, పోలీసులను బూతులు తిట్టడం, మహిళా అధికారి కాలర్ పట్టుకుని కొట్టడం వంటి చర్యలకు పాల్పడటం వల్ల కావ్యా థాప‌ర్‌ను అరెస్ట్ చేసి జుహూ పోలీస్ స్టేష‌న్‌కు తరలించారు. అంధేరి కోర్టులో ఆమెను హాజరుపరచగా... జ్యూడిషియల్ కస్టడీ విధించారు.


Also Read: ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న 'సన్ ఆఫ్ ఇండియా' థియేటర్లు! మ్యాట్నీ షోస్ 100 క్యాన్సిల్





'ఈ మాయ పేరేమిటో' సినిమా ద్వారా కావ్యా థాపర్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'ఏక్ మినీ కథ' చేశారు. అది ఓటీటీలో విడుదలైంది. సినిమాలు కాకుండా పతాంజలి, మేక్ మై ట్రిప్, కోహినూర్ యాడ్స్ చేశారు. 


Also Read: సమంత - పూజా హెగ్డే మధ్య గొడవ ముగిసినట్టేనా!?