కలెక్షన్ కింగ్, డా. మోహన్ బాబు నటించిన తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా' నేడు (శుక్రవారం, ఫిబ్రవరి 18న) విడుదలైంది. విమర్శకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మరి, ప్రేక్షకుల నుంచి? అంటే... కొందరు చాలా బావుందని చెబుతున్నారు. మరి కొందరు తమకు నచ్చలేదని చెబుతున్నారు. 'సన్ ఆఫ్ ఇండియా' విడుదలకు ముందు రెండు అంటే రెండు టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయని ట్రోల్స్ నడిచాయి. అయితే... అది అవాస్తం అని ఈ రోజు కొన్ని థియేటర్లకు వెళితే అర్థం అవుతుంది. కొన్ని ఏరియాల్లో ఉదయం ఆటకు ప్రేక్షకులు వెళ్లారు. స్క్రీన్ షాట్స్ తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది పక్కన పెడితే... కొన్ని థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య మరీ తక్కువగా ఉందని సోషల్ మీడియా టాక్.
'సన్ ఆఫ్ ఇండియా' సినిమా నైజాం (తెలంగాణ)లో 95, సీడెడ్ (రాయలసీమ)లో 40కు పైగా, ఆంధ్రాలో 130కు పైగా... మొత్తం 265కు పైగా థియేటర్లలో విడుదలైంది. అయితే... అందులో వందకు పైగా థియేటర్లవ్ మ్యాట్నీ షోస్ క్యాన్సిల్ అయినట్టు ఒకరు ట్వీట్ చేశారు. ఇంకొకరు ఎవరో ఉదయం ఆటకు థియేటర్లలో నాలుగు టికెట్స్ మాత్రమే అమ్ముడైన కారణంగా వెనక్కి పంపించేశారని ట్వీట్ చేశారు. సినిమా చూసిన వాళ్ళ కంటే సినిమాను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవాళ్ళు ఎక్కువ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న పోస్టులను యథావిధిగా ఇక్కడ అందించాం. అందులో వ్యక్తులు పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. ఒక్కసారి సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను చూస్తే...