Samantha Vs Pooja Hegde: సమంత, పూజా హెగ్డే గతాన్ని పక్కన పెట్టేశారా? 'బీస్ట్' సినిమాలో 'అరబిక్ కుతు...' పాటకు సమంత స్టెప్పులు (Samantha - Halamathi Habibo Dance Video Goes Viral) వేయడం, ఆమెకు పూజా హెగ్డే కాంప్లిమెంట్స్ ఇవ్వడం చూస్తుంటే... ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ముగిసినట్టేనని అనుకోవాలా? అంటే... 'ఆ గొడవ ముగిసినట్టే! ఇద్దరూ మర్చిపోయి ఉంటారు' అని ఇండస్ట్రీలో కొంత మంది అనుకుంటున్నారు. అసలు, ముగియడానికి ఇద్దరు ఎప్పుడు గొడవ పడ్డారు? అని ఆలోచనలో పడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే... ఒక్కసారి 2020 మేలోకి వెళ్ళాలి.


'అల... వైకుంఠపురములో' సినిమా రెండేళ్ళ క్రితం సంక్రాంతికి విడుదలైంది. దానికి రెండేళ్ళ ముందే 'రంగస్థలం' విడుదలైంది. 'అల...' విడుదల తర్వాత పూజా హెగ్డే (Pooja Hegde) ది గోల్డెన్ లెగ్ అనే టాక్ మొదలైంది. ఇప్పటికీ అది ఉందనుకోండి. సమంత (Samantha) ది కూడా గోల్డెన్ లెగ్. అయితే... ఇద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. ఎక్కడా ఎదురుపడిన దాఖలాలు కూడా లేవు. అయితే... మే, 2020లో పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో సమంత గురించి ఒక పోస్ట్ పడింది.


పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో 'ఆమె అంత అందంగా ఏమీ లేదు' (I don't find her pretty at all) అని రాసి ఉంది. 'రంగస్థలం'లో సమంత ఫొటోలు ఉన్నాయి. దాంతో సమంత మీద పూజా హెగ్డే మీమ్ షేర్ చేసిందని, అవమానించిందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మొదలైంది. కాసేపటికి, తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ హ్యాక్ అయ్యిందని పూజా హెగ్డే వివరణ ఇచ్చారు. టెక్నికల్ టీమ్ కష్టపడి హ్యాకర్స్ నుంచి అకౌంట్ వెనక్కి తీసుకొచ్చారని రాసుకొచ్చారు. అయితే... ఆమె మాటలను సమంత, ఆమె స్నేహితులు నమ్మినట్టు లేరు. ఎందుకంటే... ఆ తర్వాత రెండు మూడు రోజులకు 'నా అకౌంట్ హ్యాక్ కాలేదు' అంటూ చిన్మయి, నందినిరెడ్డి సోషల్ మీడియాలో జోక్స్ వేశారు కూడా! ఇప్పుడు అదంతా గతం. వర్తమానానికి వస్తే... పూజా హెగ్డే కథానాయికగా నటించిన 'బీస్ట్'లో పాటకు సమంత స్టెప్పులు వేశారు.


'బీస్ట్'లో విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. అందులో 'అరబిక్ కుతు...' సాంగ్ ఇటీవల విడుదలైంది. 'అలమత్తి హబిబో...' హుక్ స్టెప్ వైరల్ అయ్యింది. దానికి చాలా మంది స్టెప్పులు వేసి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. స‌ర్‌ప్రైజ్ ఏంటంటే... సమంత కూడా స్టెప్స్ వేశారు. ఆమె రీల్ చూసిన పూజా హెగ్డే 'అద్భుతం' అని ప్రశంసించారు. దీన్నిబట్టి... రెండేళ్ళ క్రితం జరిగిన ఇష్యూను ఇద్దరూ మర్చిపోయినట్టే అనుకోవాలి. అన్నట్టు... అక్కినేని నాగచైతన్యకు జోడీగా పూజా హెగ్డే మరోసారి నటించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. గతంలో వీళ్ళిద్దరూ 'ఒక లైలా కోసం' చేశారు. ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరోసారి జంటగా కనిపించనున్నారని టాక్. 


Also Read: ఐరన్‌మ్యాన్‌గా ‘టామ్ క్రూజ్’ - ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్ - ఈసారి ‘డాక్టర్ స్ట్రేంజ్’ మామూలుగా లేదుగా!


Also Read: ‘కళావతి’ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా? ఆ స్టెప్స్‌ను మహేష్ బాబు ఇట్టే పట్టేశారు