Kalavathi Song | ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటికే ఆ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్.. ఇటీవల యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ‘కళావతి’ లిరికల్ సాంగ్‌‌కు మరింత ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ పాటలో మహేష్ బాబు వేసిన స్టెప్స్‌ అభిమానులకు భలే నచ్చేశాయి. రీల్స్, షార్ట్స్.. ఇలా ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ‘కళావతి’ సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. 


ఇందులో మహేష్ బాబు కళావతి సిగ్నేచర్ స్టెప్‌ను ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోతోపాటు తమన్, కీర్తి సురేష్‌ల ఫన్ చూపించారు. ‘కళావతి’ లిరికల్ సాంగ్ తరహాలోనే ఈ మేకింగ్ వీడియో కూడా మీకు నచ్చేస్తుంది. ఈ పాట చిత్రీకరణకే కాదు, లిరికల్ సాంగ్ రిలీజ్‌కు కూడా బాగానే ఖర్చు పెట్టారని ఇండస్ట్రీ టాక్. మీకు కూడా ఈ పాటను చూడగానే అర్థమైపోయే ఉంటుంది.


Also Read: క్లాసిక్ 'కళావతి' ముందే వచ్చేసింది, మహేష్ వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇదిగో!


ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ మాత్రమే కాదు.. సంగీత దర్శకుడు తమన్, గాయకుడు సిద్ శ్రీరామ్, ఇతర వాద్యాకారులతో కూడా కలర్‌ఫుల్‌గా పాటను చిత్రీకరించారు. ఈ పాటలో కనీసం 2 నిమిషాలు వీరంతా కనిపించి ఉంటారు. దీని కోసం సుమారు రూ.60 లక్షలు ఖర్చు పెట్టారని తెలిసింది. అయితే, వారి కష్టం ఏదీ వృథా కాలేదు. కానీ, యూట్యూబ్‌లో రిలీజ్ కంటే ముందే ఈ పాట బయటకు లీకైపోయింది. వేరే దారి లేకపోవడంతో ఈ పాటను చెప్పిన రోజు కంటే ముందే విడుదల చేయాల్సి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 


‘కళావతి’ సాంగ్ మేకింగ్ వీడియోను ఇక్కడ చూసేయండి: