Tom Cruise: మార్వెల్ ఫ్రాంచైజీలో ‘స్పైడర్ మ్యాన్: నో వే హోం’ తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’(Doctor Strange in The Multiverse of Madness). వేర్వేరు విశ్వాల నుంచి వచ్చిన విలన్లు, ఇతర డాక్టర్ స్ట్రేంజ్‌లతో భూమిపైన ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ ఎలా పోరాడాడు? భూమిని ఎలా కాపాడాడు? అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.


ఈ సినిమా గురించి ఇప్పుడు క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐరన్ మ్యాన్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్ (Robert Downey Jr.) ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అయితే ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’లో వేరే విశ్వం నుంచి ఐరన్ మ్యాన్‌గా యాక్షన్ హీరో ‘టామ్ క్రూజ్’ కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. మిషన్ ఇంపాజిబుల్ సినిమాల ద్వారా తనకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వచ్చింది. ఆయన ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ పోషిస్తున్నాడనే విషయం కచ్చితంగా ఫ్యాన్స్‌లో జోష్ నింపేదే.


‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’లో వోల్వెరిన్ (Wolverine), ప్రొఫెసర్ ఎక్స్ (Professor X), ఫెంటాస్టిక్ ఫోర్ (Fantastic Four), డెడ్ పూల్ (Deadpool) కంటి క్యారెక్టర్లు ఉండనున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రలన్నీ నిజంగా ఉంటే మాత్రం కచ్చితంగా ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు.


ఈ ట్రైలర్‌లో డాక్టర్ స్ట్రేంజ్, వాండాలకు సంబంధించిన ఇతర వేరియంట్లను కూడా చూపించారు. ముఖ్యంగా జాంబీ స్ట్రేంజ్, జాంబీ వాండా గెటప్స్, పాత్రలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.