Sony Linkbuds TWS Earbuds Launched: సోనీ లింక్ బడ్స్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) ఇయర్‌బడ్స్ గ్లోబల్ లాంచ్ అయ్యాయి. వీటిలో కొత్త తరహా ఓపెన్ రింగ్ డిజైన్ అందించారు. అంటే వినియోగదారులు కంట్రోల్స్‌పై ట్యాప్ చేయకుండానే... చుట్టుపక్కల వారు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవచ్చన్న మాట. దీంతోపాటు ఇందులో ఆటోమేటికల్లీ పాజ్ ప్లేబ్యాక్ అనే ఫీచర్ కూడా అందించారు. అంటే వీటిని ఉపయోగించేవారు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే మ్యూజిక్ ఆటోమేటిక్‌గా ఆగుతుందన్న మాట.


సోనీ లింక్ బడ్స్ ఇయర్‌బడ్స్ ధర (Sony Linkbuds TWS Earbuds Price)
అమెరికాలో వీటి ధరను 179.99 డాలర్లుగా (సుమారు రూ.13,500) నిర్ణయించారు.ఇవి ప్రస్తుతం సోనీ అమెరికా అధికారిక వెబ్ సైట్, అమెజాన్, బెస్ట్ బైల్లో అందుబాటులో ఉంది. గ్రే, వైట్ రంగుల్లో ఈ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఇవి ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు.


సోనీ లింక్ ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్లు (Sony Linkbuds TWS Earbuds Features)
ఈ ఇయర్‌బడ్స్‌లో 12 ఎంఎం ఓపెన్ రింగ్ డ్రైవర్లను అందించారు. ఆడియో ట్రాన్స్‌పరెన్సీ కోసం ఓపెన్ సెంట్రల్ డయాఫ్రంను అందించారు.ఓపెన్ రింగ్ డిజైన్ కారణంగా వినియోగదారులు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా... బయట మాట్లాడేవి వినవచ్చు. డిజిటల్ సౌండ్ ఎన్‌హేన్స్‌మెంట్ ఇంజిన్ (డీఎస్ఈఈ) ద్వారా హై క్వాలిటీ ఆడియోను ఇది అందించనుంది. వినియోగదారుని పరిసరాల ఆధారంగా సౌండ్‌ను అడ్జస్ట్ చేసేలా అడాప్టివ్ వాల్యూమ్ కంట్రోల్ కూడా ఇందులో అందించారు.


దీంతోపాటు ఇందులో వైడ్ ఏరియా ట్యాపింగ్ కూడా అందించారు.అంటే ఇయర్ ఫోన్‌ను కాకుండా చెవుల ముందు ట్యాప్ చేయడం ద్వారా కూడా ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయవచ్చన్న మాట. స్పీక్ టు చాట్ అనే ఫీచర్‌ను అందించారు. దీని కారణంగా వినియోగదారులు ఎవరితో అయినా మాట్లాడటం ప్రారంభిస్తే... మ్యూజిక్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుందన్న మాట. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా, సిరిలను ఇది సపోర్ట్ చేయనుంది. స్పాటిఫైకి డైరెక్ట్‌గా జెస్చర్స్ కూడా ఇందులో ఉన్నాయి.


ఇందులో బ్లూటూత్ వీ5.2 ఫీచర్‌ను అందించారు. ఎస్‌బీసీ, ఏఏసీ ఆడియో ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ దేనికి అయినా వీటిని కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు గూగుల్ ఫాస్ట్ పెయిర్ ద్వారా వీటిని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు చాలా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే 5.5 గంటల ప్లేబ్యాక్‌ను ఇది అందించనుంది. చార్జింగ్ కేస్ ద్వారా మరో 12 గంటల బ్యాటరీ లైఫ్ కూడా లభించనుంది. 10 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 90 నిమిషాల పాటు వీటిని ఉపయోగించవచ్చని సోనీ అంటోంది. ఒక్కో ఇయర్ బడ్ బరువు నాలుగు గ్రాములు మాత్రమే. బాక్స్‌తో కలుపుకుంటే మొత్తంగా 34 గ్రాములుగా వీటి బరువు ఉండనుంది.


Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!