మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) కన్నుమూశాడు. సోమవారం ఉదయం తన కుమారుడు మృతి చెందినట్లు నాదెళ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులందరికీ మెయిల్ ద్వారా ఈ విషయాన్ని సంస్థ వెల్లడించింది. ఆయన కుటుంబం ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ మైక్రోసాఫ్ట్ మెయిల్ చేసింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
జైన్‌తో తనకున్న పరిచయాన్ని చిల్డ్రన్స్ హాస్పిటల్ సీఈఓ.. మైక్రోసాఫ్ట్‌తో పంచుకున్నారు. నాదెళ్ల కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.
పుట్టుకతోనే
సత్య నాదెళ్ల కుమారుడు జైన్ పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. చిన్నప్పటి నుంచి వీల్ చైర్‌కే జైన్ అంకితమయ్యాడు. జైన్ నడవలేడు, చూడలేడు, సరిగా మాట్లాడలేడు. ఇక ఈ బాధను భరించలేక ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ నాదెళ్ల తిరిగారు కానీ ఎలాంటి ఫలితం లేదు. ఒకవైపు తన కొడుకు పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ , ప్రపంచాన్ని ముందడుగు వేయించాలనే తపనతో నాదెళ్ల ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నారు. కానీ చివరికి జైన్ కన్నుమూశాడు.
నాదెళ్ల ఓ మంచి నాన్న
సత్య నాదెళ్ల నేటి తరానికి ఓ ఇన్‌స్పెరేషన్. ఆయన ఓ టెక్ దిగ్గజమే కాదు.. అంతకుమించి ఓ మంచి నాన్న. పుట్టుకతోనే వీల్ ఛైర్‌కు పరిమితమైన కుమారుడ్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఏనాడు అతని అవస్థను చూసి భాదపడలేదు. కుమారుడిపై ఆయనకున్న ప్రేమ అద్భుతం. ఆయనకు ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు.
ఆయన రూటే సెపరేటు..
2014లో స్టీవ్ బామర్ నుంచి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. ఆయన వచ్చాక మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు జరిగాయి. కొత్త తరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు. క్లౌడ్ కంప్యూటింగ్ రంగంపై కూడా కంపెనీ విస్తృతంగా పనిచేసింది. మొబైల్ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇలా ఏది చేసినా, ఏం ఆలోచించినా ఆయన రూటే సెపరేటు.
Also Read: Satya Nadella: మన సత్యనాదెళ్ల గురించి ఈ 13 విషయాలు తెలుసా?