Delhi Police busted drugs and seized 560 kgs of cocaine worth Rs 2000 Crores | న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో డ్రగ్స్ కలకలం రేపాయి. దేశ చరిత్రలో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో సోదాలు నిర్వహించిన పోలీసులు ఏకంగా 560 కేజీలకు పైగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ దాదాపు రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.


డ్రగ్స్ పై ప్రభుత్వాలు ఉక్కుపాదం


డ్రగ్స్ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. గంజాయి, కొకైన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు యువత బానిసలు కాకుండా చూడటంలో భాగంగా ఢిల్లీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు బుధవారం అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ ఆట కట్టించారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ 2,000 కోట్ల విలువైన 560 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకుందని పోలీసులు వెల్లడించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ లింకులపై ఆరా తీస్తున్నారు. గత కొన్నేళ్లలో రిపోర్టులు పరిశీలిస్తే కాలేజీ విద్యార్థులు, యువత డ్రగ్స్ కు బానిస అవుతున్నారు. తెలిసి తెలియని వయసులో డబ్బు ఆశ చూపడంతో యువత మత్తు పదార్థాల బారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.






 


పోలీసులు సీజ్ చేసిన ఈ కొకైన్‌ను అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ (International drug syndicate) సభ్యులు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయంగా డ్రగ్స్ సిండికేట్ లింకులపై, గతంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఇలా కొకైన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలను తరలించారన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. 


తిలక్ నగర్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం


ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఆదివారం ఇద్దరు ఆఘ్గనిస్తాన్ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా తెలిసిన సమాచారంతో సౌత్ ఢిల్లీ పోలీసులు స్పెషల్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇటీవల ఢిల్లీ కస్టమ్స్ అధికారులు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక లైబీరియా వ్యక్తిని అడ్డుకుని తనిఖీలు చేశారు. అతడి వద్ద రూ. 24 కోట్లకు పైగా విలువైన 1,660 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆ నిందితుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం 1985 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Also Read: Pune Chopper Crashed: పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్‌- ముగ్గురు మృతి- తృటిలో తప్పించుకున్న ఎన్సీపీ ఎంపీ


Also Read: Isha Yoga Centre : జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో తమిళనాడు పోలీసుల తనిఖీలు - మహిళల్ని బందీలుగా ఉంచుకుంటున్నారని ఆరోపణలు