Israel-Iran Tension Row: మంగళవారం రాత్రి (2 అక్టోబర్ 2024) ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా క్షిపణులు ప్రయోగించింది. గాజా, లెబనాన్‌లలో ప్రజలపై ఇజ్రాయెల్ చేసిన దాడులు, IRGC, హమాస్, హిజ్బుల్లాహ్ నాయకుల హత్యలపై ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్టు ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయెల్‌పై సాయంత్రం మొదలైన ఇరాన్ దాడులు అర్థరాత్రి వరకు కొనసాగాయి.

  


ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు


ఈ దాడి అనంతరం ఇరు దేశాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు రావడంతో ప్రపంచమంతా అలర్ట్‌ అయింది. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పందించిన అమెరికా కూడా ఇజ్రాయెల్‌కు అండగా నిలబడాల్సిన టైం వచ్చిందని పేర్కొంది. ఒక్క అమెరికా మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలు ఇరాన్ దాడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. వాటన్నింటినీ చూస్తుంటే రాబోయే కాలం ప్రపంచవ్యాప్తంగా ఓ ఘర్ష పూరిత వాతావరణం ఖాయమే సంకేతాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. 


ఆమెరికా జోక్యం చేసుకుంటే...






Also Read: పేజర్ పేలుడు నుంచి క్షిపణుల దాడి వరకు - ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 14 రోజుల్లో ఏం జరిగింది?


మధ్యప్రాచ్యం పూర్తి స్థాయి అంతర్గత యుద్ధంలో మునిగిపోయి ఉంది. ఈ విషయంలో US తన విధానం మార్చుకుంటే తప్ప పరిస్థితిలో మార్పు రాలేదని DAWN న్యాయవాద డైరెక్టర్ రేడ్ జార్రార్ అభిప్రాయపడ్డారు. "యునైటెడ్ స్టేట్స్ విధానం మార్చుకొని నిలకడ మీద ఉండి, ఇజ్రాయెల్‌కు ఆయుధాలు పంపబోమని చెప్పే వరకు ఈ వార్ ఆగదు. ఇజ్రాయెల్ నేరాలకు ఆర్థిక సహాయం చేయబోమని వేరే ఇతర హెల్క్‌ కూడా అందివ్వబోమని చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 
ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందిస్తుందనడంలో సందేహం లేదని మిడిల్ ఈస్ట్ కౌన్సిల్ ఆన్ గ్లోబల్ అఫైర్స్‌లో సభ్యుడు ఒమర్ రెహమాన్ చెప్పారు. ఇలాంటి చర్యలు ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. లెబనాన్‌లో చూస్తున్నట్లుగా పెద్ద ఎత్తున విధ్వంసం కలిగించే సత్తా ఉందంటున్నారు. ఆ దేశం నిజంగా వినాశకరమైన యుద్ధాన్ని చేయగలదని చెప్పుకొచ్చారు. 






ఎవరిది పైచేయి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం... ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేస్తే యుద్ధం ప్రారంభమైతే మాత్రం అల్లకల్లోలం తప్పదంటున్నారు. ఈ యుద్ధంలో చాలా దేశాలు జోక్యం చేసుకోవచ్చని అంటున్నారు. ఇజ్రాయెల్‌కి మద్దతుగా  అమెరికా రావచ్చు. కొన్ని ముస్లిం దేశాలు ఇరాన్‌కు మద్దతుగా ఉంటాయి. అమెరికా ఒకసారి యుద్ధంలోకి వస్తే తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ కూడా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇయ్యగలవు. అటువంటి పరిస్థితిలో ఇరాన్‌ను ఇజ్రాయెల్ ధ్వంసం చేయగలదని అంటున్నారు. 


Also Read: పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం- అర్థరాత్రి విధ్వంసం