Probe starts against Jaggy Vasudev Isha Yoga Centre : ఇషా ఫౌండేషన్ గురించి ప్రపంచం అంతా తెలుసు. జగ్గీ వాసుదేవ్ యోగా, ఇతర ప్రవచనాలు కూడా అంతే ఫేమస్. అయితే ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు చెందిన ఆశ్రమలు, ఇషా యోగా సెంటర్స్ లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. కోయంబత్తూరులో అత్యంత భారీ ఈషా ఫౌండేషన్ ఆశ్రమం ఉంది. అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.    


జగ్గీ వాసుదేవ్ పై వచ్చిన ఆరోపణలు ఏమిటంటే ?


జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెలు ఇద్దరికీ బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేసుకోకండా సన్యాసంలో కలిసిపోయేలా చేశారని వారిద్దరూ ఇప్పుడు ఇషా ఫౌండేషన్ లోనే నిర్బంధంలో ఉన్నారని కామరాజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆ మహిళల్ని హాజరు పరచాలని ఇషా ఫౌండేషన్ ను ఆదేశించింది. ఆ మహిళలు తాము ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో చేరామని.. తమ తల్లిదండ్రులు తప్పుడు పిటిషన్ వేశారని వాంగ్మూలం ఇచ్చారు.అయితే ఇలాంటి కేసులు చాలా ఉన్నాయని కామరాజ్ తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సోదాలకు హైకోర్టు ఆదేశించింది.   



సన్యాసం తీసుకున్నవారికి ఆశ్రమంలో ఆశ్రయం 


జగ్గీ వాసుదేవ్ ఆశ్రమాల్లో ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి కోల్పోయి అథ్యాత్మకి జీవనం కొనసాగించాలనుకునేవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. పురుషులు అయినా మహిళలు అయినా.. సన్యాసంలో చేరాలనుకుంటే జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో చేరవచ్చు. ఇందులో వారికి క్రమబద్దమైన జీవితాన్ని అలవాటు చేస్తారు. కుటుంబ బంధాలను వదులుకుంటారు. అయితే ఇలా చేయడానికి .. అక్కడికి వచ్చిన వారికి బ్రెయిన్ వాష్ చేస్తారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో సోదాలు నిర్వహిస్తున్నారు . అక్కడ ఎవరైనా బలవంతంగా ఉంచారని తమంతట తాముగా ముందుకు వచ్చి పోలీసులకు చెబితే తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 


ఆరోపణల్ని ఖండించిన ఈషా ఫౌండేషన్ 


సోదాల విషయంలో ఈషా ఫౌండేషన్ ఏమీ స్పందించలేదు. కానీ తమపై చేస్తున్న ఆరోపణలను పూర్తి గా ఖండించింది. స్వయంగా  బాధితులుగా చెబుతున్న వారే కోర్టుకు హాజరై.. స్వచ్చందంగా ఆశ్రమంలో ఉంటున్నామని చెప్పిన తర్వాత కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అంటన్నారు. పెళ్లి చేసుకోవాలని లేదా సన్యాసం తీసుకోవాలని ఈషా ఫౌండేషన్ ఎవర్నీ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేసింది. 





 
అయితే ఈషా ఫౌండేషన్ వ్యస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెలకు పెళ్లి చేసి ఫ్యామిలీ లైఫ్  ను ఇస్తే ఇతరుల పిల్లలను ఎందుకు సన్యాసంలో కలుపుతారని న్యాయమూర్తులు ప్రశ్నించి..సోదాలకు ఆదేశించారు. పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.