అది రాజస్థాన్‌లోని భరత్ పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్ కార్యాలయం. ఓ వైపు క్లాసులు జరుగుతున్నాయి. మరో వైపు ఆఫీసు రూం నుంచి తుపాకీ పేల్చిన శబ్దం వినింపించింది. దీంతో అందరూ పరుగున వెళ్లి చూశారు. అక్కడి సీన్ భయంకరంగా ఉంది. ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని ఉన్నాడు. మరో మహిళ భుజంలోకి బుల్లెట్ దిగింది.. అక్కడంతా రక్తం చిందింది. స్కూల్ డైరక్టర్ అయిన మహిళ భయంతో బిగుసుకుపోయింది. అదే సమయంలో ఆ స్కూల్లో చదివే బాలిక ఓ వైపు నిలుచుని అందర్నీ చూస్తోంది. ఈ సీన్ చూస్తూంటే అక్కడేదో జరిగిందని.. అర్థమైపోతుంది. అసలేం జరిగింది.. ఎందుకు జరిగింది తెలియాలంటే.. అంతకు ముందు రోజు నుంచి ఏం జరిగిందో తెలుసుకోవాలి. 


Also Read: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఏనుగు తల్లి, పిల్ల ! న్యాయం జరగలేదేమో కానీ అక్కడ చేసిన రచ్చ చూస్తే...


రాజస్తాన్‌లోని భరత్  పూర్‌ జిల్లాలో పప్పు గుర్జార్ అనే ఆర్మీ జవాన్ కుటుంబం నివసిస్తోంది. ఆ జవాన్ కుమార్తె ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతోంది. ఆ పాప నిన్న ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. టీచర్ తనను చెంప దెబ్బకొట్టిందని తండ్రికి ఫిర్యాదు చేసింది. తన బిడ్డను కొడతారా అని ఆ ఆర్మీజవాన్‌కు పిచ్చి కోపం వచ్చింది. అటో ఇటో తేల్చుకోవాలని డిసైడయ్యారు. పాపను తీసుకుని స్కూల్‌కు వెళ్లారు. ప్పు గుర్జార్ ఆవేశం  చూసి ఎందుకైనా మంచిదని ఆయన భార్య కూడా స్కూల్‌కు వెళ్లింది. 


Also Read: Guruvayur Temple: భక్తులారా ఇదేమైనా న్యాయమా..? పనికిరావని హుండీలో వేస్తారా?


నేరుగా స్కూల్ డైరక్టర్ కార్యాలయంలోకి వెళ్లి పుప్పు గుర్జార్ తన బిడ్డను ఎందుకు కొట్టారని గట్టిగా ప్రశ్నించారు. ఆ బాలిక హోంవర్క్  చేయకుండా వచ్చిందని అందుకే మందలించాల్సి వచ్చిందని స్కూల్ డైరక్టర్ చెప్పారు.  ఈ సందర్భంగా జవాన్‌కు.. స్కూల్ డైరక్టర్‌కు మధ్య మాటా మాటా పెరిగింది. చివరికి ఆగ్రహంతో జవాన్ పప్పూ గుర్జార్ తన తుపాకీ తీసి స్కూల్ డైరక్టర్‌కు ఎక్కుపెట్టారు. కాల్చేశారు., అయితే ప్రమాదాన్ని గుర్తించిన  జవాన్ భార్య..తన భర్త ఆగ్రహానికి స్కూల్ డైరక్టర్ ఎందుకు బలి కావాలని.. షార్ప్‌గా తాను తూటాకు ఎదురెళ్లింది. తూటా ఆమె భుజంలోకి దూసుకుపోయింది. 


Also Read: UP Election 2022: 'నా వల్లే రామరాజ్యం.. కావాలంటే నా కలలోకి వచ్చిన కృష్ణుడిని అడగండి'


ఆమెను తర్వాత ఆస్పత్రికి తరలించారు. జవాన్ గుర్జార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన రాజస్తాన్‌లో సంచలనం సృష్టించింది. 


Also Read: Fake Pan Card Check: పాన్‌ కార్డుపై డౌటా? అసలు, నకిలీ ఇలా గుర్తించండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి