కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పరంబికులం అనే ఊరు ఉంది.  అందమైన ప్రకృతి మధ్య ఉండే ఆ ఊళ్లో ఓ పోలీస్ స్టేషన్ కూడా ఉంది.  ప్రశాంతంగాఉండే ఆ ఊళ్లో పోలీసులు నైట్ డ్యూటీలు చేయడం తక్కువ. డ్యూటీలోఉండే ఒకరిద్దరూ కూడా పెట్రోలింగ్‌లో ఉంటారు. ఆ తర్వాత ఇంటికెళ్లిపోయారు. తర్వాతి రోజు డ్యూటీ పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తారు. అలా రెండు రోజుల కిందట ఓపెన్ చేయడానికి వచ్చిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ గేటు విరిగిపోయి ఉంది. 


Also Read: Guruvayur Temple: భక్తులారా ఇదేమైనా న్యాయమా..? పనికిరావని హుండీలో వేస్తారా?


పోలీస్ స్టేషన్ గేటు పూర్తిగా విరిగిపోయింది. దీంతో దొంగలు పడి ఉండటమో..లేకపోతే..  గతంలో అరెస్ట్ చేసిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన వస్తువుల కోసం మళ్లీ పోలీస్ స్టేషన్‌ను రాబరీ చేయడమో చేసి ఉంటారని పోలీసులు కంగారు పడ్డారు. వెంటనే స్టేషన్‌లోకి వెళ్లి అన్నీ చెక్ చేశారు. అదృష్టవశాత్తూ అన్నీ ఉన్నాయి. ఒక్క చిన్న దొంగతనం కూడా జరగలేదు. మరి ఎవరు గేటును పగలగొట్టారన్నది కూడా తేల్చాలి కదా.. అందుకే సీసీ కెమెరా ఫుటేజీ ఓపెన్ చేశారు. 


Also Read: UP Election 2022: 'నా వల్లే రామరాజ్యం.. కావాలంటే నా కలలోకి వచ్చిన కృష్ణుడిని అడగండి'


పోలీస్ స్టేషన్ గేటు విరగిన రోజు రాత్రి మొత్తం సీసీ టీవీ ఫుటేజీని  చూసి పోలీసులు అదిరి పడ్డారు. గేటును ఎవరు విరగ్గొట్టారో అందులో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ వారిపై కేసులు పెట్టలేదు. పెట్టి అరెస్ట్ చేస్తే ఈ సారి స్టేషన్‌నే ధ్వంసం చేసేస్తారు. అందుకే సైలెంటయిపోయారు. కానీ నిందితుల్ని మాత్రం బయట ప్రపంచానికి తెలియచెప్పారు. అందు కోసం వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ఇదే. 


 





Also Read: India's Omicron Cases: ఈ దేశానికి ఏమైంది? ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా.. కొత్తగా 37 వేల కేసులు


నిజమే.. ఓ తల్లి ఏనుగు.. తన బిడ్డతో సహా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. గేటు వద్ద కాసేపు అరిచింది. కానీ ఎవరూ బయటకు రాలేదు. దీంతో గేటు విరగ్గొట్టేసింది. అయినా ఎవరూ రాలేదు. అక్కడ ఎవరూ లేరు కదా.. !  ఆ తర్వాత తన దారిన తాను పోయింది. ఆకలేసో.. అన్యాయం  జరిగిందనో చెప్పుకోవడానికి వస్తే ఎవరూ లేక..., తన పద్దతిలో నిరసన తెలియచేసిందని నెటిజన్లు ఈ వీడియో చూసి సెటైర్లు వేస్తున్నారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి