మంగళవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం కృష్ణా నది నుంచి తాడువాయి గ్రామానికి అనధికారికంగా నాటు పడవల్లో ప్రయాణాలు చేస్తున్నారు ప్రజలు. ఈ పడవ నది మధ్యలో ఆగిపోవడంతో కొంతసేపు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే నాటు పడవ నిర్వాహకులు అప్రమత్తమై పడవను ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో ఇదే ప్రాంతంలో బల్లకట్టు మునిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం లైఫ్ జాకెట్లు కూడా లేకుండా నాటు పడవల్లో ప్రయాణాలు చేస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల నాటు పడవలను ఆశ్రయిస్తున్నామని ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి బల్లకట్టులు ఏర్పాటుచేయాలని, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేసే దానికంటే ప్రమాదం జరగకుండా చూడాలని ప్రభుత్వ అనుమతులు లేకుండా తిరుగుతున్న పడవలను సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


Also Read: విశాఖ తీరంలో హై టెన్షన్... భగ్గుమన్న రింగ్ వలల వివాదం... బోటు తగలబెట్టిన మత్స్యకారులు


ప్రమాదాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలేవి?


ద‌శాబ్దాలుగా న‌దీ ప్రయాణాలు సాగుతున్నా అవి సుర‌క్షితంగా సాగడానికి పటిష్టమైన చర్యలు లేవనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. గత రెండేళ్లలో ఏపీలో 100 మందికి పైగా పడవ ప్రమాదాల్లో మృతి చెందినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. 1992లో దేవీప‌ట్నం మండ‌లంలోని పోచ‌మ్మగండి స‌మీపంలో జరిగిన ప్రమాదంలో లాంచీలో ప్రయాణిస్తున్న దాదాపు వంద మంది ప్రాణాలు మరణించారు. 2017లో కృష్ణా న‌దిలో ఇబ్రహీంప‌ట్నం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 20 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 2018 మే 15న గోదావ‌రి నదిలో ప్రయాణిస్తున్న లాంచీ ప్రమాదానికి గురై 22 మంది మృతి చెందారు. అప్పట్లో ప‌రిమితికి మించి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎక్కిన బోటు నదిలో మునిగిపోయింది. 2018లోనే జూలై 14న ముమ్మిడివ‌రం మండ‌లం ప‌శువుల్లంక స‌మీపంలో గోదావరి నదిని దాటడానికి వాడే నాటు ప‌డ‌వ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల వ్యవ‌ధిలో నాలుగు ప‌డ‌వ ప్రమాదాల్లో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: చెత్తపన్ను కట్టకపోతే ఇంటి ముందే చెత్త పోస్తారట... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే హెచ్చరిక !


Also Read:  అమరావతి కార్పొరేషన్ దేని కోసం ? అభివృధ్ది కోసమా ? రాజకీయం కోసమా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి