విశాఖలో మరోసారి రింగు వలల వివాదం భగ్గుమన్నాయి. పెద్దజాలరి పేట, చిన్నజాలరిపేట మత్స్యకారులు మధ్య వివాదం నెలకొంది. సముద్రంలో రింగ్ వల బోటును సంప్రదాయ మత్స్యకారులు తగలబెట్టారు. చిన్నజాలరిపేట గ్రామంలోకి చొరబడిన పెద్దజాలరిపేట మత్స్యకారులు రింగ్ వలలను ధ్వంసం చేశారు. రింగు వలల వాడకంతో సంప్రదాయక మత్స్యకారుల ఉపాధిపై దెబ్బకొడుతున్నారంటూ పెద్ద జాలరి పేట మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలు ఘర్షణకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. 



Also Read: చెత్తపన్ను కట్టకపోతే ఇంటి ముందే చెత్త పోస్తారట... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే హెచ్చరిక !


బోటుకు నిప్పు పెట్టిన ఓ వర్గం మత్స్యకారులు


విశాఖలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం నెలకొంది. మత్స్యకారుల్లో ఓ వర్గం రింగు వలలతో వేటకు వెళ్లడాన్ని మరో వర్గం మత్య్సకారుల అడ్డుకున్నారు. దీంతో వివాదం నెలకొంది. సముద్రంలో రింగు వలల పడవకు ఓ వర్గం మత్స్యకారులు నిప్పు పెట్టారు. దీంతో వాసవానిపాలెం తీరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి భారీగా చేరుకొన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సముద్రంలోకి వెళ్లిన బోట్లను బయటికి తీసుకొచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. బోట్లకు నిప్పు పెట్టారని, తమ పిల్లలను ఓ వర్గం అపహరించిందని మరో వర్గానికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. తమ వలలు కోసేశారని, తమను కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read:  అమరావతి కార్పొరేషన్ దేని కోసం ? అభివృధ్ది కోసమా ? రాజకీయం కోసమా ?


రింగ్ వలలను నిషేధించాలి 


మంగళవారం పెద్దజాలరిపేట, గంగమ్మతల్లి గుడి మత్స్యకారుల మధ్య రింగ్ వలలపై ఘర్షణ చెలరేగింది. తిమ్మాపురం వద్ద నడి సముద్రంలో రింగ్‌ వలల బోటుకు ఓ వర్గం మత్స్యకారులు నిప్పుపెట్టారు. దీంతో ఇరువర్గాల మత్స్యకారులు ఘర్షణకు దిగారు. ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణను గమనించిన ఇరు గ్రామాల మత్స్యకారులు తీరం వద్దకు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. రెండు గ్రామాల ప్రజలు గొడవకు దిగకుండా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటుచేశారు. రింగ్ వలలతో చేపల వేట చేయకూడదని సంప్రదాయ వలలతో చేపలను వేటాడే మత్స్యకారులు కోరుతున్నారు. రింగ్ వలలతో చేపల వేటాడే వారితో సంప్రదాయ పద్ధతిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఘర్షణకు దిగుతున్నారు. ఇదే విషయమై ఇరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఘర్షణ పడ్డారు. రింగ్ వలలను నిషేధించాలని సంప్రదాయ మత్స్యకారులు కోరుతున్నారు. దాదాపుగా 50  రోజులుగా సంప్రదాయ చేపల వేటకు వెళ్లే తమకు చేపలు దొరకడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. 


Also Read: ప్రేమతో కూర వండిన భార్య.. మొహం చిట్లించిన భర్త, ఆవేశంతో ఘోరానికి పాల్పడ్డ భార్య


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి