ABP  WhatsApp

West Bengal: బయట తాళం వేసి, ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు- 8 మంది సజీవ దహనం

ABP Desam Updated at: 22 Mar 2022 06:44 PM (IST)
Edited By: Murali Krishna

బంగాల్‌లో మళ్లీ రాజకీయ హత్యాకాండ మొదలైంది. ప్రత్యర్థుల ఇళ్లకు తాళం వేసి దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.

బయట తాళం వేసి, ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు

NEXT PREV

రాజకీయ హత్యలతో బంగాల్ మళ్లీ అట్టుడికింది. బీర్ భూమ్ జిల్లాలో రాజకీయ హత్యకు ప్రతీకారంగా కొందరు దుండగులు మంగళవారం తెల్లవారుజామున ఐదు ఇళ్లకు నిప్పంటించారు. ఇంట్లోని వారు బయటికి రాకుండా తాళాలు వేసి ఈ పని చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.






ఎందుకు?


బీర్‌భూమ్‌లోని రాంపూర్‌హాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రత్యర్థుల ఇళ్లకు కొంతమంది నిప్పంటించారని స్థానికులు తెలపారు. బీర్‌భూమ్‌లోని రాంపూర్‌హాట్‌లో టీఎంసీకి చెందిన పంచాయితీ నాయకుడు భాదు ప్రధాన్‌పై గుర్తు తెలియని దుండగులు బాంబులు వేశారు.


ఓ బృందం 7 నుంచి 8  ఇళ్లకు తాళాలు వేసి నిప్పంటించారు. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలానికి బీర్భూమ్ జిల్లా మేజిస్ట్రేట్, అగ్నిమాపక అధికారులు, స్థానిక పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



 










టీఎంసీ నేత బహదూర్ షేక్‌ను గత రాత్రి హత్య చేసినదానికి ప్రతిగా 7-8 ఇళ్లకు కొంతమంది దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశాం. సంబంధిత ఎస్‌డీపీఓ, రాంపూర్‌హాట్ ఇంఛార్జ్‌ను బాధ్యతలను తొలిగించాం. ఘటనపై సిట్ ఏర్పాటు చేశాం.                                                                    - మనోజ్ మాలవీయా, బంగాల్ డీజీపీ






Published at: 22 Mar 2022 02:43 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.