ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధం విషయంలో భారత్ చూపిస్తోన్న వైఖరిపై అమెరికా పరోక్ష విమర్శలు చేసింది. రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్‌ ఎందుకో వణుకుతోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు. అమెరికా మిత్ర దేశాల్లో భారత్‌ మాత్రమే మాస్కోపై ఆంక్షలకు భయపడుతోందన్నారు.


ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు భారత్ సిద్ధంగా లేదు. రష్యాపై ఆంక్షలు విధిస్తుంటే భారత్ వణుకుతోంది. ఈ విషయంలో భారత్‌ అస్థిరంగా ఉంది. కానీ రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ముందుకు వచ్చాయి.


క్వాడ్‌లో


రష్యాపై క్వాడ్‌లో ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని భారత్‌ మాత్రమే కఠినంగా లేదని బైడెన్ అన్నారు. క్వాడ్​లో భారత్​, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలు. అయితే మిగతా మూడు దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్​ మాత్రం తటస్థ వైఖరి అవలంబిస్తోంది.







భారత్ స్టాండ్


రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత్ ముందు నుంచి శాంతిమంత్రమే జపిస్తోంది.  ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తాయని పేర్కొంది. ఉక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించిన సమావేశాల్లోనూ భారత్ ఇదే చెప్పింది.


" రష్యా- ఉక్రయిన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళనగా ఉంది. అన్ని పక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఇరుపక్షాలకు వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలి. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించాలి.                                                "                            - భారత్


ఓటింగ్‌కు దూరం


ఉక్రెయిన్ అంశంలో రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఇటీవల జరిగిన ఓటింగ్‌లకు భారత్ దూరంగా ఉంది. రష్యాతో బలమైన మైత్రి ఉన్నందునే ఓటు వేసేందుకు భారత్ దూరంగా ఉంటోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ కారణంగానే ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై ఓటింగ్​కూ భారత్ దూరంగానే ఉంది.


Also Read: Leopard : అడవిలో బోర్‌ కట్టునట్టిన చిరుత ఏం చేసిందో చూడండి


Also Read: Watch Video : 125 ఏళ్ల యోగా లెజెండ్ స్వామి శివానందపై నెటిజన్లు ప్రశంసలు, పద్మ శ్రీ అందుకున్న తీరుకు ఫిదా!