ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు చెన్నై ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తామని ఇటీవల జొమాటో చేసిన ప్రకటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఆర్డర్‌ ఇచ్చిన 10 నిమిషాల్లో ఎలా వినియోగదారులకు ఆహారం డెలవరీ చేస్తారో తమకు వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ సంస్థకు గురువారం నోటీసులు జారీ చేశారు.


అలా ఎలా?


వినియోగదారుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చే ఆహార పదార్థాలను జొమాటో ప్రతినిధులు ఇళ్లు, కార్యాలయాలు అంటూ ఎక్కడికైనా సరే తీసుకెళ్లి అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారుడికి మరింత చేరువయ్యే విధంగా ఆర్డర్‌ఇచ్చిన 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రకటనను జొమాటో వర్గాలు తాజాగా చేశాయి.


అయితే కేవలం పది నిమిషాల్లో ఎలా డెలివరీ చేస్తారో..? అనే చర్చ బయలుదేరింది. చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో అయితే, ఇది అసాధ్యమన్న వాదనలు కూడా వినిపించాయి. పది నిమిషాల్లో వినియోగ దారుడికి ఆహార పదార్థాలు అందించాల్సి ఉండటంతో, డెలివరీ బాయ్స్ తమ వాహనాల్లో అతివేగంగా దూసుకెళ్లాల్సి ఉంది.


ఈ సమయంలో ట్రాఫిక్‌ నిబంధనల్ని అతిక్రమించక తప్పదు. దీనిని పరిగణించిన చెన్నై ట్రాఫిక్‌ పోలీసు వర్గాలు జొమాటోకు నోటీసులు జారీ చేశాయి. పది నిమిషాల్లో ఎలా ఫుడ్‌ సరఫరా చేస్తారో అనే విషయంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు.


. 10 నిమిషాల్లోనే డెలివరీ కోసం డెలివరీ పార్ట్‌నర్లపై ఎటువంటి ఒత్తిడీ పెట్టబోమని తెలిపింది. ఆలస్యంగా డెలివరీ చేసినందుకు వారిపై ఎటువంటి పెనాల్టీ కూడా విధించబోమని పేర్కొంది. టైం ఆప్టిమైజేషన్ ప్రక్రియ రోడ్డు మీద జరగబోదని తెలిపింది.


మరి 10 నిమిషాల్లో డెలివరీ ఎలా సాధ్యం?


ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఇలా చేయలేదు. ఈ ఫీట్ సాధించే మొదటి కంపెనీగా ఉండటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాం. జొమాటో ఇన్‌స్టంట్‌ను సాధించడానికి ఎనిమిది నిబంధనలను పాటించనున్నాం. అవేంటంటే...


1. ఇంటి ఆహారం వండటానికి అయ్యే ధరకే అందించడం (దాదాపుగా)
2.అత్యధిక నాణ్యతతో తాజా ఆహారం
3. ప్రపంచ స్థాయి పారిశుధ్య విధానాలు
4. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను వీలైనంత తక్కువ ఉపయోగించడం
5. సులభంగా తినడానికి వీలయ్యే కన్వీనెంట్ ప్యాకేజీ
6. ట్రేస్ చేయడానికి వీలయ్యే సప్లై చైన్
7. డెలివరీ పార్ట్‌నర్ భద్రత
8. రెస్టారెంట్ పార్ట్‌నర్లతో మరింత మెరుగ్గా భాగస్వామ్యం


Also Read: Birbhum Violence Case: బంగాల్ హింసాకాండపై సీబీఐ దర్యాప్తు- కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం


Also Read: Wooden Treadmill: ఉడెన్ ట్రెడ్‌ మిల్‌ చూసిన ఆనంద్‌ మహేంద్ర ఫిదా- ఒకటి పంపించాలంటూ శ్రీనివాస్‌కు రిక్వస్ట్