ఉడెన్ ట్రెడ్‌మిల్ తయారు చేసిన శ్రీనివాస్‌ను ఇప్పుడు సోషల్ మీడియా హీరో అయిపోయారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన పనితనాన్ని మెచ్చుకున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విద్యుత్ అవసరం లేకుండా ఆయన తయారు చేసిన ట్రెడ్‌మిల్‌పై మొదట కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన వివరాలు చెప్పాలని నెటిజన్లు కోరారు. అప్పటి నుంచి ఆయనపై రీసెర్చ్ మొదలైంది.
తర్వాత చాలా మంది ప్రముఖులు శ్రీనివాస్ క్రియేటివిటీని అభినందించారు. ఇప్పుడు ఆ జాబితాలో ఆనంద్ మహేంద్ర చేరారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడంలోనూ వెలుగులోకి తీసుకురావడంలో ఆనంద్‌మహేంద్ర ప్రత్యేక చొరవ చూపుతుంటారు. ఇప్పటికి ఇలాంటి లోకల్ లాటెంట్‌ను చాలా మంది ఆయన ద్వారా వెలుగులోకి వచ్చారు. అలా ఆయన దృష్టి ఇప్పుడు శ్రీనివాస్‌పై పడింది.
మార్కెట్‌లో చాలా ట్రెడ్‌మిల్స్ దొరుకుతున్నాయి. కానీ వాటిలో ఎక్కువ పవర్‌తోనే నడుస్తుంటాయి. కానీ శ్రీనివాస్ తయారు చేసిన ఉడెన్ ట్రెడ్‌మిల్ పూర్తిగా పవర్ లేకుండానే నడుస్తుంది. నిజానికి దీన్ని ఉడెన్ ట్రెడ్‌మిల్ అనడం కంటే ఓ కళాకారుడి ఆలోచనకు రూపం అనడం మంచిదన్నారు ఆనంద్‌మహేంద్ర. తనకూ అలాంటిది ఒకటి కావాలని రిక్వస్ట్ పెట్టారాయన.
ఆనంద్ మహీంద్రా పోస్ట్‌కు నెటిజన్ల చాలా క్విక్‌గా రియాక్ట్ అయ్యారు. ట్వీట్‌లు రీ ట్వీట్‌లు లైక్‌లు షేర్‌లతో దుమ్మురేపారు. శ్రీనివాస్ క్రియేటివిటీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది కదా మేకిన్ ఇండియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే కళకు, లోకల్ టాలెంట్‌కు తగిన ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.