TS Polycet : తెలంగాణ పాలిసెట్‌ నోటిఫికేషన్‌(Polycet Notification) విడుదల అయింది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి జూన్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పాలిసెట్ అప్లికేషన్లు(Applications) స్వీకరిస్తారు. వంద రూపాయల ఆలస్య రుసుంతో జూన్‌ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్‌ 30న పాలిసెట్‌ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. పాలిసెట్ జరిగిన 12 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. తెలంగాణ‌లో పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. హైద‌రాబాద్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ ట్రైనింగ్ తెలంగా(Telangana)ణ పాలిసెట్ నోటిఫికేష‌న్‌ను గురువారం విడుద‌ల చేసింది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరించనుంది. జూన్‌ 4 వరకు పాలిసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. పాలీసెట్ ద్వారా ప‌దో త‌ర‌గ‌తి(10th Class) పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజ‌నీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సెకండ్ ఫిప్ట్ పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహా రావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లోని సీట్లను భ‌ర్తీ చేస్తారు. పాలిసెట్ ఎంట్రన్స్ ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయి ఉండాలి. 


ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్లు జారీ


 తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల అయింది. ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy) మంగళవారం ప్రకటించారు. ఎంసెట్(EAMCET) పరీక్షలు జులై 14, 15, 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. జులై 13న ఈసెట్‌, జులై 14, 15 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 18, 19, 20వ తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 


105 పరీక్షా కేంద్రాల్లో 


తెలంగాణ ఎంసెట్(EAMCET) షెడ్యూల్ ను మంగళవారం విడుదల అయింది. ఈ ఏడాది జూలై 14 నుంచి 20వ తేదీ వరకు 28 రీజనల్ సెంటర్స్ లో 105 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఐఐటీ జేఈఈ(IIT JEE) ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదల అయింది. దీంతో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్ లలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు ఈ నెల మొదటి వారంలో ఉన్నత విద్యా మండలి భేటీ అయింది. ఎంసెట్ నిర్వహణపై చర్చించింది. ఈ నెల 14వ తేదీనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావించింది కానీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు.  ఐఐటీ జేఈఈ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మే నెలలో ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తైన తర్వాత ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 


ఇంటర్ మార్కుల వెయిటేజ్





ఎంసెట్‌ పరీక్ష పూర్తైన నెల రోజుల్లోపు ఎంసెట్‌ ర్యాంకులు ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల(Inter Marks) వెయిటేజ్‌ కలిపేవారు. కానీ ఈసారి  ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎంసెట్ కు ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో కనీస మార్కులతో విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. దీంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.