India’s longest tunnel road : దేశంలోనే అతి పొడవైన టన్నెల్ రోడ్డు హైదరాబాద్(Hydeabad) లో రాబోతోంది. జూబ్లీహిల్స్(JubileeHills) రోడ్డు నంబర్ 45 జంక్షన్ నుంచి బంజారాహిల్స్(BanjaraHills) రోడ్డు నంబర్ 12 జంక్షన్ వరకు దాదాపు 10 కి.మీల దూరం పొడవైన హైవే రోడ్డు టన్నెల్‌(Road Tunnel)ను నిర్మించనున్నారు. నాలుగు లేన్ల టన్నెల్ ను కేబీఆర్ పార్క్(KBR Park) జంక్షన్ మీదుగా ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్, పంజాగుట్ట వరకు నిర్వంచనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ టన్నెల్ నిర్మాణ బాధ్యతను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కి అప్పగించింది. జీహెచ్ఎంసీ ఈ టన్నెల్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై నిపుణులతో అధ్యయనం చేయించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. దేశంలో ప్రస్తుతం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ (Shyam Prasad Mukhurjee Tunnel)అత్యంత పొడవైనదిగా ఉంది.


చెట్లు కూల్చివేసేందుకు ఇష్టం లేక టన్నెల్ ఆలోచన


భారతదేశంలోని ప్రస్తుతం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ 9.20 కి.మీ పొడవున అత్యంత పొడవైనది. కశ్మీర్‌(Kashmir)ను దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ టన్నెల్ కలుపుతుంది. ముంబయిలో పొడవైన టన్నెల్ నిర్మించేందుకు ఆలోచన చేసినా అమలుకు నోచుకోలేదు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్ కోసం కేబీఆర్ పార్క్‌లోని వందలాది చెట్లను తొలిగించాల్సి ఉంటుంది. చెట్లను నరికివేయడాన్ని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం టన్నెలర్ రహదారి ఆలోచన చేసింది. ఎస్‌ఆర్‌డీపీ(SRDP) ప్రాజెక్టు కింద బహుళస్థాయి ఫ్లైఓవర్‌లను నిర్మించడం ద్వారా కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్‌లను ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. అయితే దీనికి 1,500 చెట్లను నరికివేయాల్సి వచ్చింది.


సిగ్నల్ రహిత ప్రయాణామే లక్ష్యంగా 


అప్రోచ్ రోడ్లతో పాటు టన్నెల్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాల్సింది ఉంది. లైటింగ్, వెంటిలేషన్, భద్రత, నిర్వహణ అవసరాలు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకోవాలి. టన్నెల్ ఏర్పాటు, అప్రోచ్ రోడ్ల రూపకల్పన, భూకంప రక్షణ చర్యలు, సర్వీస్ రోడ్లు, కూడళ్లు, పునరావాసం, విస్తరణ మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్ట్ సాంకేతిక, ఆర్థిక సాధ్యతను పరిశీలించాలి. కొన్ని సంవత్సరాల క్రితం, ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలుపుతూ ఈఎస్జెడ్ కింద వచ్చే పార్కు మొదటి సరిహద్దు గోడ లోపల చెట్లను నరకకూడదని GHMCకి చెప్పింది. రెండో సరిహద్దు గోడ వెలుపల ఉన్న చెట్లు ESZ కిందకు రావని పేర్కొంది. దీంతో చెట్లను నరికివేయకుండా భూగర్భ సొరంగం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. GHMC అధికారులు మాట్లాడుతూ సిటీలో ముఖ్యమైన ప్రదేశాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి సిగ్నల్ రహిత కూడళ్ల ఏర్పాటు చేసే లక్ష్యంతో SRDP రూపొందించామన్నారు. SRDPలో భాగంగా దుర్గం చెరువు వద్ద తీగల వంతెనతో సహా రోడ్ నంబర్ 45, మైండ్‌స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్‌లోని ఫ్లైఓవర్ వంటి వివిధ ప్రదేశాలలో అనేక గ్రేడ్ సెపరేటర్లను నిర్మించారు. SRDP ఫ్లైఓవర్లు, తీగల వంతెన నిర్మాణం వల్ల పంజాగుట్ట, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 అనేక జంక్షన్లలో రోజువారీ ట్రాఫిక్ రద్దీ నుంచి కొంత ఉపశమనం కలిగించింది.