ఆదేశిక సూత్రాలు ద్వారానే పాలసీలు ఉండాలని రాజ్యాంగం చెప్పిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే అసమానతలు పూడ్చేందుకు వికేంద్రీకరణ నినాదం అందుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ పూర్వకాలం నుంచి పెద్దలంతా ఆలోచించినట్టుగానే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చామన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు కేంద్రీకరణ అందుకున్నారని ఆరోపించారు. అప్పుడు కూడా రాజధాని కట్టాలను కోలేదని ఏకంగా నగరాన్ని కట్టాలనే ప్లాన్ చేశారన్నారు. నాలుగైదు వందల ఏళ్లు నుంచి నగరాలు అభివృద్ది చేస్తే నాలుగైదేళ్లలోనే నగరం కట్టాలని చూస్తే భ్రమ కాక మరేంటని ప్రశ్నించారు. అన్ని ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశారు. ఇంకా వేరే ప్రాంతానికి ఇవ్వడానికి ఏం మిగిలిందన్నారు. మూడు మండలాల్లో తొమ్మిది నగరాలు అభివృద్ధి చేద్దామనుకున్నారు. మూడు మండలలా మిగతా రాష్ట్రమా... అని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన పీఠికలో ఎక్కడైనా ఫిట్ అవుతుందో లేదో చూడాలన్నారు.
శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడ బెస్ట్ పాజిబులిటీ ఉంటే అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలన్నారని బుగ్గన తెలిపారు. వాళ్లరిపోర్టు ప్రకారం ఒకచోట నుంచి మరో చోటకు కదిలించకుండా ఏదైనా కాస్ట్ ఎఫెక్ట్ లేకుండా పర్యావరణకు హాని కరం లేకుండా రాజధాని నిర్మించాలన్నారు. వికేంద్రీకరణ ఒక్కటే అని చెప్పారు. కానీ అప్పటి ప్రభుత్వం మంత్రులు టీడీపీ ఎంపీలతో కలిసి కమిటీ వేసి అమరావతిలో రాజధాని కట్టాలని నిర్ణయించారని ఆరోపించారు. అధికారిక లెక్కల ప్రకారం... పదివేల ఎకరాలు 1133 మంది రైతుల వద్ద ఉంది. అందులో 10వేల 50 మంది సీఆర్డీఏకు ఇవ్వక ముందే అమ్మేశారు. ప్లాట్లు అలాట్ అయ్యాక 7500 మంది మళ్లీ అమ్మేశారు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి వికేంద్రీకరణ తీసుకున్నామని బుగ్గన తెలిపారు.
జడ్జిమెంట్‌ను పరిశీలించాల్సిన బాధ్యత శాసనసభకు ఉందని బుగ్గన స్పష్టం చేశారు. ఇప్పుడు అమరావతి తీర్పులో చట్టాలు చేయకూడాదని చెప్పడం కరెక్ట్ కాదు. రెండు అంశాలపై జడ్జిమెంట్ ఆధార పడి ఉంది. సీఆర్డీఏ చట్టం వెనక్కి తీసుకున్న తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్ లేదు. చట్టమే లేనప్పుడు మోసం అనే పదం ఎక్కడ వచ్చిందని బుగ్గన ప్రశ్నించారు. ప్లాట్లు డెవలప్‌మెంట్ చేయడం లేదని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇదో మేనిఫెస్టో అయ్యే ఛాన్స్ ఉందని తీర్పులో చెప్పారన్నారు. " ఏ " క్యాపిటల్ అనే అంశాన్ని పరిశీలిస్తే ఎవరైనా అలానే మాట్లాడతారన్నారు. ఇది పరిశీలించాల్సిన అంశం. ఏపీసీఆర్డీఏ చట్టం అనేది ఒకసారి అయింది కాబట్టి ఆ చట్టాన్ని మార్చలేరు అంటారు. ఆ చట్టాన్ని చేసిన శాసనసభకే హక్కులేదని చెప్పడమేంటి. శాసనసభే లేకంటే చట్టం ఎక్కడ నుంచి వచ్చిందని బుగ్గన ప్రశ్నించారు.
డైరెక్షన్ ఏ బేసిస్ ఇచ్చారంటే ఏదో జరగబోయే దాన్ని ఇప్పుడే ఆపుతున్నారని బుగ్గన విమర్శఇంచారు. చట్టం ద్వారా జరిగేదాన్ని ఆపాలంటే ముందు ఎవరికి తెలుస్తుందని ప్రశ్నించారు. చట్టం చేయడానికి ఎవరు అడ్డం వస్తారు. మరి కొన్ని తీర్పుల్లో గడువు ఇస్తున్నారని అది కూడా తప్పని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. లిమిటెడ్‌గా ఉండాలన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆదేశిక సూత్రాల ప్రకారమే ఉండాలన్నారు. అక్కడ బతుకుదెరువు కోసం పోరాడుతున్న వాళ్లు ఉంటే.. ఇక్కడ పరిహారం కోసం పోరాడుతున్నావాళ్లు ఉన్నారు. వంద సంవత్సరాల చరిత్ర చూసే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని బుగ్గన తెలిపారు.