RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో స్క్రీన్స్‌లో రిలీజ్ అయి ప్రేక్షకులను అలరిస్తోంది. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమా కోసం మాస్ క్లాస్ అన్న తేడా లేదు. నాలుగేళ్లుగా దీని కోసమే ఎదురు చూస్తున్నారు. సామాన్య ప్రేక్షకులే కాదు.. సెలబ్రెటీలు కూడా సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశారు. ఇప్పుడు అదే సందడి థియేటర్ల వద్ద కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురుస్తోంది. కొందరు సినిమా చూసిన తర్వాత రివ్యూల పేరుతో పోస్టులు పెడుతుంటే.. మరికొందరు టీంను అభినందిస్తున్నారు.
సినీ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్న RRR మూవీని ఈ వారంలోనే చూస్తానన్నారు నారా లోకేష్. సినిమాపై ట్విట్టర్‌లో స్పందించిన ఆయన.. ఎంటైర్ టీంను అభినందించారు. ఓపెనింగ్ రివ్యూస్ చూస్తుంటే బొమ్మ బ్లాక్‌బాస్టర్ అని అర్థమైందన్న లోకేష్.. తారక్, రామ్‌చరణ్, రాజమౌళికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ వారంలోనే ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తానన్నారు. సినిమా కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తుందని ఆకాంక్షించారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా టీంకు ఆల్‌ది బెస్టు చెప్పారు. సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని కోరుకున్నారు.