Stock Market Update Telugu: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం ఎరుపెక్కాయి! కీలక సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ ఈల్డ్స్ రెండేళ్ల గరిష్ఠానికి చేరడం, ముడి చమురు బ్యారెల్ ధర పెరగడం, ఐరోపా, ఆసియా మార్కెట్లు నెగెటివ్‌గా కదలాడటం ఇందుకు కారణాలు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సెగ కనిపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 656 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ వరుసగా రెండో రోజు 18,000 దిగువన ముగిసింది.
క్రితం రోజు 60,754 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,845 వద్ద ఆరంభమైంది. ఇంట్రాడే గరిష్ఠమైన 60,870 తాకిన సూచీ వెంటనే పతనమైంది. మధ్యాహ్నం సమయంలో 59,949 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. చివరికి 656 పాయింట్ల నష్టంతో 60,098 వద్ద ముగిసింది.
మంగళవారం 18,113 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,129 వద్ద మొదలైంది. కాసేపటికే ఇంట్రాడే గరిష్ఠమైన 18,129ని తాకింది. వెంటనే దిగువ బాట పట్టిన సూచీ 17,884 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 174 పాయింట్ల నష్టంతో 17,938 వద్ద ముగిసింది.
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
బ్యాంకు నిఫ్టీ మాత్రం ఆద్యంతం ఒడుదొడుకులకు లోనైంది. ఉదయం 38,145 వద్ద ఆరంభమైన సూచీ 38,330 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి పతనమై 37,769 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 168 పాయింట్ల నష్టంతో 38,041 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 15 కంపెనీలు లాభాల్లో, 35 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, యూపీఎల్, కోల్ ఇండియా, మారుతీ సుజుకి లాభాల్లో ముగిశాయి. ఇన్ఫీ, శ్రీసెమ్, ఆసియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, హింద్‌యునిలివర్ నష్టాల్లో ముగిశాయి. ఆటో, మెటల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు లాభాల్లో ఉంటే బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియాలిటీ రంగాలు నష్టపోయాయి.