వరుసగా రెండు రోజులు రంకెలేసిన బుల్‌ నేడు కాస్త వేగం తగ్గించింది! మార్కెట్లు గురువారం ఆద్యంతం ఒడుదొడుకులకు గురయ్యాయి. డెరివేటివ్‌ కాంట్రాక్టులు ముగియడమూ ఇందుకు మరో కారణంగా కనిపిస్తోంది. చివరికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ స్వల్ప లాభాల్లో ముగిశాయి.


బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపు 58,649తో పోలిస్తే నేడు 58,831 వద్ద మొదలైంది. ఉదయం భారీ గ్యాప్‌అప్‌తో మొదలైన సూచీ ఒకానొక దశలో ఇంట్రాడే కనిష్ఠమైన 58,340ని తాకింది. ఆ తర్వాత కాస్త కోలుకొని ఇంట్రాడే గరిష్ఠమైన 58,889ని తాకింది. చివరికి 157 పాయింట్ల లాభంతో 58,807 వద్ద ముగిసింది.


క్రితంరోజు 17,469 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నేడు 17,524 వద్ద మొదలైంది. 11 గంటల సమయంలో 17,379 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 16,543 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. చివరికి 47 పాయింట్ల లాభంతో 17,516 వద్ద ముగిసింది.


బ్యాంకు నిఫ్టీ మాత్రం ఏకంగా 202 పాయింట్లు నష్టపోయింది. ఏడు బ్యాంకులు లాభాల్లో, ఐదు బ్యాంకులు నష్టాల్లో ముగిశాయి. ఉదయం 37,331 వద్ద మొదలైన సూచీ 37,397 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని అందుకొంది. ఆ తర్వాత ఒడుదొడుకులకు లోనవుతూ 36,884 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 37,082 వద్ద ముగిసింది.


నిఫ్టీలో ఐటీసీ, ఎల్‌టీ, ఆసియన్‌ పెయింట్స్‌, యూపీఎల్‌, బ్రిటానియా లాభాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ లైఫ్‌, ఎన్‌టీపీసీ నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ, రియాలిటీ మినహాయిస్తే మిగతా రంగాల సూచీలు సానుకూలంగానే ముగిశాయి.


Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?


Also Read: Income Tax Filing: 31 చివరి తేదీ..! ఐటీఆర్‌ ఆలస్యమైతే పెనాల్టీ తప్పదు..! ఇలా చేయండి..!


Also Read: Forbes Most Powerful Women: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 'భారతీయం'.. నిర్మలా, కమలా హారిస్‌కు చోటు


Also Read: Kia Carens: కియా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే?


Also Read: Indian Mobile Congress 2021: మెరుపు వేగంతో దేశంలో 5Gని ప్రవేశపెట్టాలన్న ముకేశ్ అంబానీ


Also Read: Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి