ప్రజలకు స్వల్ప ఉపశమనం! జూన్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. అంతకు ముందు నెల 7.04తో పోలిస్తే కొంత తగ్గి 7.01 శాతంగా నమోదైంది. అయితే ఇప్పటికీ రిజర్వు బ్యాంకు లక్షిత ద్రవ్యోల్బణం కన్నా అధికంగానే ఉండటం గమనార్హం. క్రూడాయిల్‌, పెట్రోల్‌, డీజిల్‌, వంట నూనెలు, ఆహార పదార్థాల ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది. మంగళవారం కేంద్ర గణాంక శాఖ ఈ వివరాలు వెల్లడించింది.


రెండు నెలల క్రితం ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం, ఆర్బీఐ కఠిన చర్యలు చేపట్టింది. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్నులు తగ్గించింది. వంట నూనెల ధరలు తగ్గించాలని కంపెనీలను ఆదేశించింది. స్థానికంగా ఎగుమతి చేస్తున్న ముడి చమురుపై ఎగుమతి పన్ను విధించింది. ఇతర ధ్యానాలు, పప్పుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంది. ఇక ఆర్బీఐ వడ్డీరేట్లను సవరించింది. రివర్స్‌ రెపో రేటును పెంచింది. ఫలితంగా పరిస్థితిలో కాస్త మెరుగైది.


మే నెలలో వినియోగ ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం 7.04 శాతంగా ఉంది. గతేడాది జూన్‌లో ఇది 6.26 శాతం కావడం గమనార్హం. 2022 జూన్‌లో టోకు ధరల ఇన్‌ఫ్లేషన్‌ 7.75 శాతం కాగా అంతకు ముందు నెలలో ఇది 7.79 శాతం. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో సీపీఐ ఇన్‌ఫ్లేషన్‌ 74 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనాల ద్వారా తెలుస్తోంది. కాగా ఆర్బీఐ వడ్డీరేట్లను 90 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.9 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే.


ఈ ఏడాది ఏప్రిల్‌లో పరిశ్రమల ఉత్పత్తి (IIP) 7.1 శాతం పెరిగింది. అంతకు ముందు ఏడు నెలలుగా ఈ వృద్ధిరేటు మందగమనంలోనే ఉండటం గమనార్హం. 2022 మేలో మైనింగ్‌ ఔట్‌పుట్‌ 10.9 శాతానికి పెరిగింది. విద్యుత్‌ ఉత్పత్తి 23.5 శాతానికి పెరిగింది. 2021 మే నెలలో ఐఐపీ వృద్ధిరేటు 27.6గా ఉంది. 


Also Read: బాబోయ్‌ బుమ్రా! ఇంగ్లాండ్‌ టాప్‌ 4లో ముగ్గురు డకౌట్‌!


Also Read: టెలికాం రంగంలోకి అదానీ! వేలంలో పోటీ నిజమేనన్న ప్రభుత్వం