భార్యకు తెలియకుండా భర్తలు చాలా చిలిపి పనులు చేస్తుంటారు. కొత్త రుచుల కోసం బయట కొత్తగా బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తారు. ఆఫీసు పేరు చెప్పి.. జల్సాలు చేస్తుంటారు. ముంబయికి చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు. ఆఫీస్ పని మీద ఇండియాలోనే టూర్‌కు వెళ్తున్నా అని భార్యకు చెప్పాడు. కానీ, తన ప్రేయసితో కలిసి విదేశాలకు చెక్కేశాడు. భార్యకు దొరికిపోతాననే భయంతో పాస్‌పోర్ట్‌లోని తన టూర్ డిటైల్స్ ఉన్న పేజీని చింపేశాడు. ఊహించని విధంగా భార్యకు చిక్కేశాడు.
32 ఏళ్ల సందర్శి యాదవ్ అనే వ్యక్తి తన ప్రియురాలిలో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. అయితే, భార్యకు మాత్రం ఇండియాలో ఆఫీస్ టూర్ అని చెప్పాడు. అతడు మాల్దీవుల్లో ఉండగా భార్యకు అనుమానం కలిగి ఫోన్ చేసింది. అయితే, ఆ ఫోన్ కాల్స్‌కు అతడు సమాధానం ఇవ్వలేదు. తన పాస్‌పోర్ట్ చూస్తే టూర్ విషయం తెలిసిపోతుందని భయపడ్డాడు. వెంటనే పాస్‌పోర్ట్‌లోని తన విదేశీ యాత్రల వివరాలున్న పేజీలన్నీ చింపేశాడు.
గురువారం రాత్రి ఇండియాకు తిరిగి వచ్చిన యాదవ్ పాస్‌పోర్ట్‌ను పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పాస్‌పోర్ట్‌లో వీసా స్టాంప్ ఉన్న పేజీ లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అతడిని ప్రశ్నిస్తే.. అసలు విషయం తెలిసింది. తన భార్యకు తన విదేశీ టూర్ తెలిసిపోతుందనే భయంతో ఆ పేజీలు చింపేశానని తెలిపాడు. దీంతో అధికారులు అతడిని అరెస్టు చేశారు. పాస్‌పోర్ట్‌లో ఎలాంటి మార్పులు చేసినా, చింపినా అది చీటింగ్, ఫోర్జరీ కిందకు వస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్(IPC) సెక్షన్ల కింద యాదవ్‌ను అరెస్టు చేశారు.
Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు
Also read: పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ ఆహారాలు తరచూ తినిపించండి