వానాకాలం వచ్చిందంటే చాలు, నేరేడు పండ్లు గుత్తులు గుత్తులుగా వేలాడతాయి. ఆ చెట్లున్న చోట నేలపై నేరేడు పండ్లు ఎన్నో రాలిపోతాయి. వర్షాకాలంలో మాత్రం దొరికే పండ్లు నేరేడు. సీజనల్ పండ్లను కచ్చితంగా తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే డయాబెటిక్ రోగులు ఏది పడితే అది తినకూడదు. మరి నేరేడు పండ్లు తినొచ్చా? నిర్భయంగా తినొచ్చు. వాటిని తినడం వల్ల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మధుమేహం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఈ పండ్లను వానాకాలంలో రోజుకు ఓ పది పండ్ల దాకా తిన్నా ఫర్వాలేదు.
ఇలా చేస్తే అదుపులోనే...
నేరేడు గింజలు కూడా మధుమేహులకు చాలా మేలు చేస్తాయి. ఈ గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని సీసాలో వేసి దాచుకోవాలి. రోజూ ఈ పొడిని నీటిలో కలుపుకుని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి మధుమేహులు నేరేడు పండ్లను తరచూ తింటే చాలా మంచిది. గుండె జబ్బులు ఉన్న వారు కూడా వీటిని తినవచ్చు. మెదడు పనితీరును ఇది చురుగ్గా చేస్తుంది. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
అందానికీ....
నేరేడులోని సుగుణాలు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మంపై వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించకుండా రక్షిస్తాయి. వీటిని తినడం వల్ల ముఖంపై గీతలు, మచ్చలు, ముడతలు త్వరగా రావు. వీటిని తినడం వల్ల నోట్లోని దంతాలకు కూడా ఎంతో మేలు. నోటి దుర్వాసన కూడా పోతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. రోగనిరోధశక్తిని పెంచడంలోనూ ఈ పండ్లు ముందుంటాయి. వానాకాలంలో వచ్చే రోగాలు, వ్యాధులు రాకుండా ఈ పండ్లలోని పోషకాలు అడ్డుకుంటాయి. మహిళలు, పిల్లలు వీటిని తినడం చాలా అవసరం. రక్తహీనత సమస్య తగ్గుతుంది. మూత్రాశయ సమస్యలను తీర్చడంలోనూ నేరేడు పండ్లు మేలు చేస్తాయి. కాలేయాన్ని క్లీన్ చేస్తుంది. పనితీరును మెరుగుపరుస్తుంది. వానాకాలంలో కచ్చితంగా తినాల్సిన పండ్లు నేరేడు.
Also read: బస్సులో పట్టేంత మందిని ఆటోలో ఎక్కించేశాడు, పోలీసులకే దిమ్మదిరిగింది, వైరలవుతున్న వీడియో
Also read: కేజీయఫ్‌ను మించి పోయిన బంగారు గని, ఇదే ప్రపంచంలో అతి పెద్దది, ఎక్కడుందో తెలుసా?
Also read: రోజూ ఎనిమిది గంటలకు పైగా కూర్చుని పనిచేసేవారికి షాకింగ్ న్యూస్, అలా కూర్చుంటే ఈ గుండె సమస్యలు తప్పవు