ఇండియాలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే ఎంచుకొనే ప్రధాన రవాణా సాధనం 'రైల్వే'! కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబంతో సహా ప్రయాణించినా అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే రైలు బండిని మధ్యతరగతి విమానంగా వర్ణిస్తారు.
కాలంతో పాటే రైల్వే నెట్‌వర్క్‌లోనూ అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు టికెట్ల కోసం ప్రయాణికులు గంటల కొద్దీ వరుసల్లో నిలబడేవారు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డిజిటలైజేషన్ పుణ్యమా అని ఇంటి వద్ద నుంచే ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకొంటున్నాం. నచ్చిన ఆహారాన్నీ ఆర్డర్ చేసుకొంటున్నాం.
కరోనా వైరస్ మహమ్మారి వల్ల రైల్వేస్‌లో మరింత మార్పు వచ్చింది. అన్ రిజర్వుడ్, ప్లాట్‌పాం టికెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకొనే సౌకర్యం కల్పిస్తోంది. ఇంటి వద్దే సురక్షితంగా ఉంటూ, బారులు తీరకుండా సునాయాసంగా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఈ సౌకర్యం తీసుకురావడంతో అటు ప్రయాణికులు ఇటు ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. అందరూ సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. ఇందుకోసం రైల్వేస్ యూటీఎస్ అనే ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించింది. దీంతో మీరు సులభంగా అన్ రిజర్వుడ్, ఫ్లాట్‌పాం టికెట్లను తీసుకోవచ్చు.
యూటీఎస్ యాప్ ద్వారా టికెట్ల బుకింక్‌కు నిబంధనలు
- రైల్వే వారి యూటీఎస్ యాప్ ద్వారా జనరల్ టికెట్లు, ఫ్లాట్‌పాం టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
- మీ మొబైల్ నుంచే ఆన్‌లైన్ టికెట్లు పొందొచ్చు.
- రైల్వే లైన్‌కు 20 మీటర్ల దూరం నుంచీ అన్ రిజర్వుడ్ టికెట్‌ను కొనుగోలు చేయొచ్చు.
- రైలు బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఈ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోలేం.
- ఈ సౌకర్యాన్ని మిస్ యూజ్ చేయకుండా ఉండేందుకు రైల్వేస్ జియో ఫెన్సింగ్‌ను అమలు చేస్తోంది.
- అందుకే 20 మీటర్ల దూరం పెట్టింది.
- పేపర్ లెస్ అయినప్పటికీ యాప్ నుంచి బుక్ చేసుకున్నాక టికెట్‌ను రద్దు చేసుకొనే అవకాశం లేదు.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!
Also Read: Budget 2022 Expectations: జై కిసాన్!! నగదు బదిలీ రూ.8000కు పెంపు! రైతులకు మోదీ వరాలు!!