కొద్ది రోజులుగా ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు కూడా కొన్ని నగరాల్లో వ్యత్యాసం చోటు చేసుకుంది. హైదరాబాద్లో వరుసగా మళ్లీ ఇంధన ధరలు పెరిగాయి. నగరంలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.37 పైసలు పెరిగి రూ.114.49గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.40 పైసలు పెరిగి రూ.107.40గా ఉంది. ఇక వరంగల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.16 పైసలు పెరిగి రూ.113.99 అయింది. డీజిల్ ధర రూ.0.20 పైసలు తగ్గి రూ.106.91 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.37 పైసలు పెరిగి.. రూ.114.68గా ఉంది. డీజిల్ ధర రూ.107.56 కు చేరింది. నిజామాబాద్లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.31 పైసలు పెరిగి రూ.116.39 గా ఉంది. డీజిల్ ధర రూ.0.07 పైసలు పెరిగి రూ.109.15 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధరలు తాజాగా పెరిగింది. ప్రస్తుతం రూ.116.61 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.34 పైసలు తగ్గింది. డీజిల్ ధర రూ.108.89కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
Also Read: LIC Jeevan Labh Policy: నెలకు రూ.233 చెల్లిస్తే రూ.17 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవే!
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.115.15గా ఉంది. గత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.09 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.107.48గా ఉంది. ఇది లీటరుకు రూ.0.25 చొప్పున తగ్గింది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.40 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.57 పైసలు తగ్గి.. రూ.116.68 కి చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.108.90గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.86 పైసలు తగ్గింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా నవంబరు 3 నాటి ధరల ప్రకారం 82.73 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!